Home తాజా వార్తలు సిఎం కెసిఆర్‌ను అభినందించిన బికెయూ నేత తికాయత్

సిఎం కెసిఆర్‌ను అభినందించిన బికెయూ నేత తికాయత్

BKU leader Tikait appreciates CM KCR

 

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల ఉద్యమంలో అమరులైన రైతుల పట్ల కేంద్రం కంటే ఇతర రాష్ట్రాల కంటే ముందుగా స్పదించిన తీరు పట్ల భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అభినందనలు తెలిపారు. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమంలో అమరులైన 700మంది రైతులకు పరిహారంగా సిఎం కెసిఆర్ ఎంతో ఉదారంగా సాయం ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దు చేసిన నేపద్యంలో రైతులు చేసిన ఉద్యమాన్ని సిఎం కేసిఆర్ హర్షిస్తూనే ఉద్యమంలో మృతి చెందిన రైతులకు చెందిన కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.3లక్షలు ఆర్ధికసాయం ప్రకటించారు. మొత్తం 700కుటుంబాలకు ప్రకటించిన 21కోట్ల రూపాయల ఆర్ధిక సాయాన్ని త్వరలోనే రైతుల కుంటుంబాలకు అందచేస్తామని వెల్లడించారు. ఈ నేపధ్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన రైతు సంఘాల సమావేశంలో బికేయూ నేత రాకేశ్ టికాయత్ రైతుల ఉద్యమం పట్ల, ఉద్యమంలో అమరులైన రైతుల పట్ల తెలంగాణ సిఎం కేసిఆర్ స్పందించిన తీరును ప్రశంసించారు. రైతు కుటుంబాలకు ఆర్ధిక సాయం ప్రకటించి అండగా నిలవటంలో కేంద్ర ప్రభుత్వం కంటే ఎంతో ముందుగా స్పందించారంటూ కృతజ్ణతలు తెలిపారు.

BKU leader Tikait appreciates CM KCR