Friday, March 29, 2024

నా తప్పు ఏమున్నదబ్బా…

- Advertisement -
- Advertisement -

Black Rose Naa Tappu Emunnadabbaa video song

మిస్ యూనివర్స్ ఇండియా ఊర్వశి రౌతెలా హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ఎమోషనల్ థ్రిల్లర్ ‘బ్లాక్ రోజ్’. ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. దర్శకుడు సంపత్ నంది క్రియేట్ చేస్తున్న ఈ చిత్రానికి మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈమధ్యనే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కి విశేష స్పందన లభించింది. బుధవారం చిత్ర బృందం ‘నా తప్పు ఏమున్నదబ్బా’ అంటూ సాగే ప్రమోషనల్ వీడియో సాంగ్‌ని విడుదల చేసింది. ఈ సాంగ్‌ని ఎస్. ఎస్.తమన్ విడుదల చేశారు. ఈ ప్రమోషనల్ సాంగ్ లో హీరోయిన్ ఊర్వశి రౌతేల తన అందంతో పాటు అద్భుతమైన డ్యాన్స్ స్టెప్స్‌తో విశేషంగా ఆకట్టుకుంది.

4 రోజుల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ పాటకి జానీ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశాడు. స్వతహాగా మంచి డాన్సర్ అయినా ఊర్వశి ఈ సాంగ్‌లో కష్టమైన డ్యాన్స్ మూవ్ మెంట్స్‌తో అలరించడం విశేషం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్ డ్యాన్స్ స్టెప్స్ స్ఫూర్తిగా కంపోజ్ చేసిన ఈ డ్యాన్స్‌కి రిహార్సల్స్ చేస్తూ ఊర్వశి పలుమార్లు గాయపడినా నేర్చుకొని డ్యాన్స్ చేసింది. ఈ సందర్భంగా ఊర్వశి రౌతెలా మాట్లాడుతూ “నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ‘బ్లాక్ రోజ్’ కోసం చాలా కష్టమైన డ్యాన్స్ నేర్చుకొని చేసే అవకాశం ఇచ్చింది. ఇక ఈ పాట అద్భుతంగా వచ్చింది”అని పేర్కొంది.

Black Rose Naa Tappu Emunnadabbaa video song

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News