Home జాతీయ వార్తలు కలెక్టరేట్ ప్రాంగణంలో పేలుడు

కలెక్టరేట్ ప్రాంగణంలో పేలుడు

Car-Bomb-Keralaమలప్పురం : కేరళలోని మలప్పురం కలెక్టరేట్ ప్రాంగణంలో మంగళవారం మధ్యాహ్నం బాంబు పేలుడు కలకలం సృష్టించింది. కలెక్టరేట్ ప్రాంగణంలో నిలిపి ఉంచిన ఓ కారులో పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు, బాంబ్ స్కాడ్, డాగ్ స్కాడ్ హుటాహుటిన అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.