Home తాజా వార్తలు ఆ సంచిలో నుంచే పేలుడు: సిపి సజ్జనార్

ఆ సంచిలో నుంచే పేలుడు: సిపి సజ్జనార్

SP Sajjanar

 

హైదరాబాద్: రాజేంద్రనగర్ పేలుడులో గాయపడిన అలీ అనే వ్యక్తి మృతి చెందాడని సిపి సజ్జనార్ తెలిపారు. పేలుడు జరిగిన స్థలాన్ని సజ్జనార్ పరిశీలించారు. 15 ఏళ్లుగా ఇదే ప్రాంతాల్లో చెత్త ఏరుకొని అలీ జీవనం సాగిస్తున్నాడని చెప్పారు. చెత్త ఏరుకున్న సంచిలో నుంచే పేలుడు సంభవించిందన్నారు. పేలుడు కారణం రసాయనమని తాము అనుమానిస్తున్నామని చెప్పారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్, ఆక్టోపస్ బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని సజ్జనార్ చెప్పారు. అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

 

Blast in Beggar Bag in Rajendra Nagar in Hyderabad

 

Blast in Beggar Bag in Rajendra Nagar