Home దునియా చలికి చెక్..

చలికి చెక్..

 

చలిని తరిమేయడానికి స్వెట్టర్, జర్కిన్ వేసుకునే రోజులు ఎప్పుడో పోయాయి. నేటి తరం అమ్మాయిలైతే కనీసం వీటివైపు కూడా చూడరు. హుడీ, స్కార్ఫ్, టోపీ.. ఇలా ట్రెండ్‌కి, ఫ్యాషన్‌కు దగ్గరగా ఉంటూ చలిని తరిమేస్తున్నారు. వీరి అభిరుచులకు తగినట్లుగా మార్కె ట్లో కూడా కొత్త కొత్త డిజైన్లు కనికట్టు చేస్తున్నాయి.

కాలేజీకి వెళ్లేవారు ఆధునికతను, ఫ్యాషన్‌ను కలబోసిన డిజైనర్ వేర్‌లను ఎంచుకుని ట్రెండీగా, అందంగా కనిపిస్తున్నారు. వాటిల్లో స్కార్ఫ్ అనేది ఎవర్‌గ్రీన్ ట్రెండ్. స్కార్ఫ్ చలిని ఆపడంలోనూ, స్టైల్‌గా కనిపించేలా చేయడంలోనూ దీని ప్రత్యేకతే వేరు. స్కార్ఫ్‌లో రకరకాల డిజైన్లు, ప్రింట్లు ఉన్నాయి. సందర్భానుసారంగా వీటిని ఎంచుకుంటే ఆ అందమే వేరు. కశ్మీరీ స్కార్ఫ్ అయితే ఇక చెప్పాల్సిన పనేలేదు. బ్లాంకెట్ వ్రాప్ ఇది కాస్త పెద్దగా ఉండి మల్టీలేయర్స్‌లో స్టైలిష్‌గా కనిపిస్తుంది.

Bleak Description in Telugu