Home అంతర్జాతీయ వార్తలు నెత్తురోడిన పారిస్

నెత్తురోడిన పారిస్

pagwe-1ఐసిస్ ఉగ్రదాడులు 127 మంది మృతి
*ముంబయి తరహాలో రెస్టారెంట్, థియేటర్, స్టేడియం వెలుపల, పలుచోట్ల కాల్పులు, పేలుళ్లు

*సిరియా దాడులకు ప్రతీకారం : ఐసిస్

*ఐరాస సహా ప్రపంచ దేశాల ఖండన

*మానవత్వంపై దాడి : మోడీ

పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్‌ఐఎస్) ఉగ్రవాదులు నరమేధం సృష్టిం చారు. వారాంతపు ఆనందంలో మునిగి ఉన్న వారిపై విచక్షణారహితంగా జరిపిన కాల్పులు, తెగబడి సాగించిన పేలుళ్లతో ఆరు చోట్ల మొత్తం 127 మందికిపైగా అమాయక పౌరులు ప్రాణాలు కోల్పో యారు. 200 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో చాలా మంది చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడు తున్నారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఐసిస్ ప్రకటించుకుంది. ఫ్రాన్స్ కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 9గంటలకు (భారత కాలమానం మేరకు శనివారం తెల్లవారుజామున) ఈ దాడు లు జరిగాయి. అచ్చం భారతదేశంలోని ముంబయిలో జరిగిన దాడుల తరహాలోనే టెర్రరిస్టులు ఈ హిం సాత్మక చర్యను సాగించారు. ప్రపంచ నలుమూలల ఈ దాడి ఘటన తీవ్ర సంచలనం కలిగిం చింది. ప్రపంచ దేశాలు ఈ దాడులను తీవ్రంగా ఖండించాయి. ఈ దాడుల అనంతరం దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఫ్రాన్స్‌లో అత్యయిక స్థితి ప్రకటించడం ఇదే తొలిసారి. వారాంతం కావడంతో ప్రజలు ఎక్కువగా ఉండే రెస్టారెంట్లు, బార్లను ఉగ్రవాదులు తమ లక్షంగా ఎంచుకుని హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. నగరంలో ఆరు చోట్ల దాడులు జరి గాయి. ఓ రెస్టారెంట్‌లో ఆగంతకుడు కొందరిని బందీలుగా చేసుకున్నట్లు తొలుత వార్తలు వెలువ డ్డాయి. తరువాత కొద్ది సేపటికి దుండగులు జరిపిన కాల్పుల్లో అక్కడ 11 మంది చనిపోయినట్లు , తాను కూడా రెస్టారె ంట్‌లో బందీ అయినట్లు బిబిసి జర్నలిస్టు ఒకరు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటన తరువాత దేశాధ్యక్షులు హోలాండ్ ప్రజలను ఉద్దేశించి టీవీ ద్వారా ప్రసంగించారు. ఓ వైపు రెస్టారెంట్‌లో దాడి జరుగుతుం డగానే మరోవైపు బతక్లాన్ సాంస్కృతిక ప్రదర్శన శాలలో సాయుధులు చొరబడి తూటాలు కురిపించారు. ప్రేక్ష కులను బందీలుగా చేసుకుని , వారిపై కాల్పులకు దిగడంతో 100 మందికి పైగా దుర్మరణం చెందారు. పై గా అక్కడ బాంబులు కూడా పేల్చినట్లు వెల్లడయింది. ఇక్కడ పోలీసులు జరిపిన ఎదురుకాల్పులలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. ఆత్మాహుతి దాడులలో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. 10 నుంచి పదిహే ను నిమిషాల పాటు కాల్పులు, బాంబుపేలుళ్లతో మారణ కాండను సృష్టించారు.
ఫుట్‌బాల్ మైదానం సమీపంలో మరో దాడి
జాతీయ ఫుట్‌బాల్ స్టేడియం డీ ఫ్రాన్స్ వెలుపల , మైదా నానికి సమీపంలోనే మరికొందరు ఉగ్రవాదులు దాడికి దిగారు. ఈ సమయంలో జర్మనీ, ఫ్రాన్స్ మధ్య సాకర్ సమరం జరుగుతోంది. . గోల్స్ ప్రతిగోల్స్, అభిమానుల కేరింతలు, లక్ష సాధనకు ఆటగాళ్ల పరుగులు సాగు తుండగా వెలుపలనే పేలుళ్లు జరగడం, ఆ సమయంలో ఫ్రాన్స్ అధ్యక్షులు ఫ్రాంకోయిస్ కూడా స్టేడియంలోనే ఉన్నారు. ఆయనను లక్షంగా చేసుకునే దాడులకు దిగి నట్లు అనుమానిస్తున్నారు. మైదానం వెలుపల పేలుళ్లు జరగడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా ఉరుకులు పరుగు లతో బయటకు వచ్చారు. అయితే తొక్కిసలాట జరగ కుండా అధికారులు 3 గేట్లను తెరిచి ప్రేక్షకులను బయ టకు పంపించారు. దేశాధ్యక్షుడిని భద్రతా సిబ్బంది సు రక్షిత ప్రాంతానికి తరలించారు. ఉగ్రవాదులను పట్టకు నేందుకు వెనువెంటనే 1500 మంది సైనికులు హుటా హుటిన రంగంలోకి దిగారు. ఘటనల నేపథ్యంలో ఫ్రా న్స్ అధ్యక్షులు అత్యున్నత సమావేశం ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. దోషులను సమాజం ముందు నిలబెడుతామని, ఈ క్లిష్ట సమయంలో ప్రజలు ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దేశమంతా ఏకంగా నిలవాలని పిలుపు నిచ్చారు. ముష్కరులు ఇప్పటికీ నగర ంలోనే సంచరిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్న పరిస్థితు లలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావద్దని కోరారు. అంతర్జాతీయ సరిహద్దులను మూసివేస్తున్నట్లు, గగనతల విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు వెల్లడి ంచారు. ప్రస్తుత అత్యయిక పరిస్థితితో హోలాండ్ తమ టర్కీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత పారిస్‌లో జరిగిన అతి పెద్ద మారణకాండ ఇదే అని వెల్లడైంది. రెస్టారెంట్‌పై దాడికి దిగిన ఉగ్రవాదులు కనీసం 8 మంది వరకూ ఉంటారని వెల్లడైంది. వారంతా ఆత్మాహుతి దుస్తులను ధరించి ఉన్నారు. ఫ్రాన్స్ రాజధాని వీధులలో అరాచకాని కి దిగారు. 2004లో మాడ్రిడ్‌లో రైలుబాంబు దాడుల అనంతరం యూరప్‌లో జరిగిన తీవ్రస్థాయి రక్తపాతం ఇదే. ఏకె 47లు ధరించిన ఉగ్రవాదులు అల్లాహో అక్బర్ అంటూ ఓ బృందంగా రాక్ డాన్స్ జరుగుతున్న సాంస్కృతిక కేంద్రంలోకి దూసుకుపోయినట్లు వెల్లడయి ంది. ఇక్కడ వారు భారీ స్థాయిలో నరమేధం సృష్టించా రు. వారు చాలా సేపటి వరకూ తమ అధునాతన ఆయు ధాలతో కాల్పులకు దిగినట్లు, తూటాలతో పలువురి శరీ రాల జల్లెడ పట్టినట్లు అయిందని , ప్రతి చోట నెత్తుటి మడుగులు పర్చుకుని ఉన్నాయని , ప్రేక్షకులు పరుగులు తీశారని ఈ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా అందిస్తున్న రేడి యో వ్యాఖ్యత ఒకరు తెలిపారు. ఇక్కడ దాడి సమ యంలో అమెరికా రాక్ బ్యాండ్ ఈగల్స్ ఆఫ్ డెత్ మెటల్ కార్యక్రమం ఉర్రూత లూగించే రీతిలో సాగుతోంది.
ఎదురుకాల్పులలో ఉగ్రవాదులంతా హతం
దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులను ఎదురుకాల్పుల్లో చంపివేసినట్లు పారిస్ పోలీసు అధికారులు తెలిపారు. దాడుల సమయంలో పోలీసులు, భద్రతా సిబ్బంది జరి పిన ఎదురుకాల్పుల్లో వీరు చనిపోయినట్లు వెల్లడించారు. అయితే ఎక్కువ మంది ఆత్మాహుతి దాడులలో చని పోయినట్లు స్పష్టం అవుతోంది. ఘటనలకు సంబంధించి అరెస్టులు జరగలేదు. నగరంలో అన్ని చోట్ల నిఘాను ముమ్మరం చేశారు.
సిరియాపై దాడులకు ప్రతీకారం : ఐసిఎస్ ఉగ్రవాదులు
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై ఫ్రాన్స్ దాడులకు ఫలితం అనుభవించండి అంటూ కాల్పుల తరువాత ఉగ్ర వాదులు పెద్దగా అరుచుకుంటూ వెళ్లిపోయినట్లు ప్రత్య క్ష సాక్షులు తెలిపారు. ఐసిస్ అణచివేతకు అమెరికా ఆధ్వర్యంలో సాగుతోన్న పోరుకు ఫ్రాన్స్ మద్దతు కూడా ఉంది. ఇటీవలే రష్యా విమానాన్ని తామే కూల్చివేసినట్లు ఐసిస్ వర్గాలు బహిరంగంగా ప్రకటించాయి. ఈ విమాన పతనంలో దాదాపు 300 మంది దుర్మరణం చెందారు. పారిస్ ఘటనలకు పాల్పడింది తామేనని ఐఎస్‌ఐఎస్ మీ డియా సెంటర్ నుంచి ఒక వీడియో సందేశం వెలువరి ంచారు. సిరియాలో దాడులకు ఇది ప్రతీకార జ్వాల అని పేర్కొన్నారు. సిరియాలో దాడులకు పాల్పడుతున్న దేశా లలో ఇలాంటి మరిన్ని దాడులు తప్పవని ప్రకటించారు.
ఐరాసతో పాటు ప్రపంచ దేశాల ఖండన
పారిస్‌లో జరిగిన దాడులను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ ఘటనల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశా యి. ఈ ఘటనలు తీవ్ర మనోవేదనకు గురిచేశాయని బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన వెలువరించారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇది మాన వత్వంపై జరిగిన దాడిగా అమెరికా అధ్యక్షులు ఒబామా తెలిపారు. ఇది అమానుష చర్య అని రష్యా అధ్యక్షులు పుతిన్, జర్మనీ ఛాన్స్‌లర్ ఎంజెలా మెర్కల్ ఖండించారు. పారిస్‌లో పలుచోట్ల జరిగిన దాడులను ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‌కీమూన్ ఖండించారు. ఉగ్రదాడుల నివారణకు కలిసికట్టు పోరు సాగించాలని, ఈ చర్యలకు తమ సహకారం ఉంటుందని ప్రకటించారు.