Thursday, April 18, 2024

బర్డ్ ఆస్పత్రిలో తక్కువ ఖర్చుతో రోగులకు రక్త పరీక్షలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తిరుపతి బర్డ్ ఆస్పత్రిలో తక్కువ ఖర్చుతో రోగులకు రక్త పరీక్షలు నిర్వహించనున్నట్లు టిటిడి ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. బర్డ్ లో అత్యాధునిక నూతన కేంద్రీయ రక్త పరీక్ష కేంద్రాన్ని బుధవారం ఉదయం ఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ.. బర్డ్, శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రికి వచ్చే రోగులకు రక్త పరీక్షలు నిర్వహించేందుకు రూ. 80 లక్షలతో టీటీడీ అత్యాధునిక నూతన కేంద్రీయ రక్త పరీక్షల కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు.

ఇందులో హేమటాలజీ, సేరాలజి , కోయా గూలేషన్, బయో కెమిస్ట్రీ వంటి రక్త పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. స్విమ్స్, రుయా, బయట ఆసుపత్రుల నుండి వచ్చే రోగులకుు కూడా తక్కువ ఖర్చుతో రక్త పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో పెథలాజికల్, మైక్రో బయోలాజికల్ టెస్టులు కూడా చేయడానికి అవసరమైన అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

Blood tests for patients at low cost at Bird Hospital

బర్డ్ ఆసుపత్రిలో ప్రతిరోజు 400 ఓపి, 20 సర్జరీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిరోజు 5 ట్రామా (ప్రమాదాలకు గురైన వారు) కేసులు, ప్రతినెల కోలియోసిస్ (గూని ఆపరేషన్లు) 5, సెరిబ్రల్ పాలసీ మరియు పోలియో వికలాంగులకు 200 నుండి 250 ఆపరేషన్లు చేస్తున్నట్లు చెప్పారు.

బర్డ్ లో అత్యాధునిక పరికరాలతో కూడిన బ్లడ్ బ్యాంక్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశామన్నారు. ఇందులో అత్యధికంగా ప్రతిరోజు 40 నుండి 45 యూనిట్ల బ్లడ్ స్విమ్స్, రుయా, మెటర్నటీ, బయట ఆసుపత్రులకు అందిస్తున్నట్లు వివరించారు అంతకుముందు బర్డ్ ఆసుపత్రి ప్రాంగణంలో ఇటీవల ఆధునికరించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన రక్త పరీక్షలు నిర్వహించే కేంద్రాన్ని, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, క్లినికల్ పేటాలజీ, బ్లడ్ బ్యాంక్ విభాగాలను పరిశీలించారు.

అనంతరం శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం సందర్శించారు. ఇటీవల గుండె మార్పిడి చికిత్స చేయించుకున్న రోగిని పలకరించారు. ఈ కార్యక్రమంలో జెఈవో శ్రీమతి సదా భార్గవి, బర్డ్ ఆసుపత్రి ప్రత్యేక అధికారి డాక్టర్ రెడ్డప్ప రెడ్డి, పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ఇఇ శ్రీ కృష్ణారెడ్డి, ఇతర అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News