Home తాజా వార్తలు ‘బ్లఫ్ మాస్టర్’ – రివ్యూ

‘బ్లఫ్ మాస్టర్’ – రివ్యూ

Bluff Master Telugu Movie Review

హైదరాబాద్: సత్యాదేవ్, నందితా శ్వేత హీరోహీరోయిన్లుగా ఆదిత్యా మీనన్, బ్రహ్మాజీ, పృధ్వీ, సిజ్జు, బాలకృష్ణ,కృష్ణచైతన్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'బ్లఫ్ మాస్టర్' . గోపీ గణేష్ దర్శకత్వంలో రమేష్ పిళ్లై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకల ముందుకు వచ్చింది. జ్యోతిలక్ష్మి, క్షణం , ఘాజీ చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించిన సత్యదేవ్  ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా నటించిన చిత్రం'బ్లఫ్ మాస్టర్'. తమిళ హిట్ మూవీ శతురంగ వేట్టై ఆధారంగా తెలుగు నేటివిటికి అనుగుణంగా ఈ  చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు గోపీగణేష్.

కథ: హీరో ఉత్తమ్ కుమార్ (సత్యదేవ్) చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోతాడు. దీంతో బతకడం కోసం ఏం చేయాలో తెలియని స్థితిలో మోసగాడిగా మారతాడు. అతను రకరకాల మోసాలు చేస్తుంటాడు. ఘరానా మోసాలు చేసి కోట్లు సంపాదిస్తాడు. అయితే చివరికి ఓసారి పోలీసులకు చిక్కుతాడు. దీంతో అతని మీద పలు కేసులు నమోదవుతాయి. అయితే ధనబలంతో అన్ని కేసుల నుంచి తప్పించుకొని బయటకు వచ్చేస్తాడు. కానీ గతంలో చేసిన పాపాలన్నీ అతన్ని వెంటాడుతాయి. అతను సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటాడు. మరి ఉత్తమ్ కుమార్ ఈ సమస్యల నుండి బయటపడ్డడా..? మంచి మనిషిగా మారాడా ? అన్నది మిగతా కథ.

విశ్లేషణ:’బ్లఫ్ మాస్టర్’  కథ చాలా సింపుల్ గా ఉంటుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథను తయారు చేశారు. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన  రైస్ పుల్లింగ్ ఎపిసోడ్,కొన్నేళ్ల కిందట తమిళనాడు లో వెలుగుచూసిన స్నేక్ గ్యాంగ్ దోపిడీ… అలాగే మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో తరచుగా వెలుగు చూసె మోసాలు… ఇలాంటి వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథను అల్లారు. దీంతో ప్రేక్షకులు ఈ కథకు కనెక్ట్ అవుతారు. మోసగాడిగా హీరో పాత్రను ఆసక్తికరంగా , వినోదాత్మకంగా తీర్చిదిద్దడం వల్ల ఆ పాత్ర కొంత వరకు కథానాన్ని బాగానే నడిపిస్తుంది. పాముల పేరుతో చేసే మోసం నేపథ్యంలో నడిచే ఆరంభ ఎపిసోడ్ వినోదాన్ని బాగానే పంచుతుంది. ఆతర్వాత మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసం చుట్టూ తిరిగే సన్నివేశాలు కూడా పర్వాలేదు. అయితే హీరోను పోలీసులకు దొరికిపోయేలా చేసి కథను మలుపు తిప్పారు.

కోర్టు విచారణ నుండి హీరో బయటపడి దర్జాగా  బయటికి వచ్చే వరకు కథనం వేగంగానే నడుస్తుంది. ప్రథమార్థం స్థాయిలోనే ద్వితీయార్థం కూడా నడిస్తే ‘బ్లఫ్ మాస్టర్’ సంతృప్తినిచ్చేవాడు. అయితే ద్వితీయార్థం కథ ఒక దశా దిశా లేకుండా సాగుతుంది. హీరో పాత్ర ఎప్పటి కప్పుడు మారిపోతూ ప్రేక్షకుల్లో అయోమయం రేపుతుంది.  ద్వితీయార్థం ఎపిసోడ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోతాయి. చివరికి కొన్ని సన్నివేశాలు బోర్ కొడతాయి. దర్శకుడు గోపీ గణేష్ తమిళ్ వర్షన్ ను దాటి క్రియేటివ్ గా చేసిందేమీ లేదు. అయితే సినిమాలో అక్కడక్కడా అతని దర్శకత్వ ప్రతిభ కనిపిస్తుంది. సునీల్ కశ్యప్ అందించిన రెండు పాటలు పర్వాలేదనిపిస్తాయి. నిర్మాణ విలువలు ఓ మోస్తారుగా ఉన్నాయి. మొత్తానికి ‘బ్లఫ్ మాస్టర్’  ప్రత్యేకమైన అనుభూతిని కలిగించే సినిమా మాత్రం కాదు.

Bluff Master Telugu Movie Review