Thursday, June 12, 2025

అప్పుల బాధ భరించలేక జలపాతంలో దూకిన రైతు

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్: పొచ్చర జలపాతంలో దూకి ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గడ్డ నర్సిరెడ్డి అనే రైతు తేజాపూర్ గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు కుమారులకు ఆస్తులు సమానంగా పంచి పెట్టాడు. వ్యవసాయం కోసం అతడు పదమూడు లక్షల వరకు బ్యాంకుల్లో అప్పులు చేశాడు. కొన్ని సంవత్సరాల నుంచి పంట సరిగా పండకపోవడంతో కౌలుకు ఇచ్చాడు. అప్పుల బాధలు భరించలేక రెండు ఎద్దులను కూడా అమ్మాడు.

అప్పులు ఎక్కువగా ఉండడంతో మద్యానికి బానిసగా మారాడు. పొచ్చర జలపాతం సమీపంలో చెప్పులు, నగదు పెట్టి ఫొన్‌లో మాట్లాడుతుండగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, స్థానికులు గమనించి జలపాతానికి దూరంగా వెళ్లాలని సూచించారు. దాదాపు అరగంట తరువాత సిబ్బంది కళ్లుగప్పి జలపాతంలో దూకారు. అందరూ చూస్తుండగా నర్సిరెడ్డి నీళ్లలో మునిగిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నర్సిరెడ్డి కుమారుడు అజయ్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News