Thursday, April 25, 2024

అమెరికన్ అభినవ వాగ్గేయకారుడు

- Advertisement -
- Advertisement -

Bob Dylan is a versatile talented person

 

( BobDylan – Nobel Laureate )
There is not a bigger giant in the history of American music
– Barack Obama
అమెరికా దేశపు అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం The Presidential Medal of Freedom తో జాతీయ సంగీతసామ్రాట్ బాబ్ డిలన్ ను 2012 లో సత్కరిస్తున్న సందర్భం లో ఒబామా అన్న మాట ఇది.
బాబ్ డిలన్ పూర్తి పేరు రాబర్ట్ ఆలెన్ జిమర్ మన్. Hebrew లో అతని అసలు పేరు Shabtai Zisel ben Avraham. 24 మే, 1941 లో మిన్నసోటా లోని అమెరికన్ యూదు కుటుంబంలో జన్మంచాడు. భార్య సారా. జెస్సే & జేకబ్ లతో కలిసి ఆరుగురు పిల్లలు. 1905 లో ఆయన తాతా నానమ్మలు యూదు వ్యతిరేక ఊచకోతల నుండిబయటపడి యక్రేన్ నుండి అమెరికా చేరుకున్నారు. వాళ్ళు టర్కీ నుండి వలస వచ్చిన జ్యూ వంశజులు. అమ్మమ్మవాళ్లు ఇటలీకి చెందిన Lithuanian Jews. డిలన్ బాల్యం అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో గడిచింది.

బాబ్ డిలాన్ కు చిన్న నాటి నుండే సంగీతం మీద ఆసక్తి ఉండేది. మొదట Blues, Country music ఇష్టపడేవాడు, పిదప Rock and Roll. చదువుకునే రోజులలో కాఫీహౌజులలో పాటలు పాడేవాడు. అప్పట్లో సంగీతరంగాన్ని ఏలుతున్న వాళ్లలో మేటి గాయకులు A.Aron Copland, Allen Ginsberg. వాళ్ళ సహచర్య సహవాసాలుడిలాన్ కు లభించాయి. డిలన్ ను ప్రభావితం చేసిన వాళ్ళ లో Surreal కవి Arthur Rimbaud, Beat సంగీతపాదుషా Ginsberg లు ముఖ్యులు. సాహిత్య పరంగా, Walt Whitman, T.S. Elliot, Homer, Shelly, Edgar Allen Poe భావజాలం అతన్ని అమితంగా ఆకర్షించింది. ప్రతీకాత్మక, అధివాస్తవికతా ఛాయలు అతని గీత రచనలలోప్రతిఫలించాయి.

అతనికి ఆసక్తి లేని సంగీత బాణీ (Genre) అంటూ లేదు. Folk, Blues, Rock, Gospel, Country, Traditional Pop, Vocal Jazz – అన్ని ప్రక్రియలను ఆపోసనం పట్టి తనదైన శైలిలోకి మలచుకుని సరి కొత్త సంగీతాన్నిసృష్టించుకొన్నాడు. గిటార్, కీబోర్డు, హార్మోనికా లాంటి వాద్యాలలో ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. జానపదబాణీలను అధునీకరించుకొని, అన్ని అమెరికన్ సంగీత ఛాయలను సంపుటీకరించుకుని మనకాలం మహనీయసంగీత కారుడుగా ఎదిగిపోయాడు. అనేక సంగీత బృందాలతో (Musical Bands) కలిసి కృషి చేశాడు. అత్యంతజనరంజక (Popular Singer) అమెరికన్ గాయకుడిగా స్థిరఖ్యాతి పొందాడు. కోటికిపైగా ఆల్బంలను విడుదల చేసిచరిత్రను స్రృష్టించిన ఏకైక అమెరికన్ కళాకారుడు బాబ్ డిలన్.

బాబ్ డిలన్ బహుముఖ ప్రతిభాశాలి – Polymath; గొప్ప గాయకుడు, పాటల కవి (Lyricist), స్వర కల్పకుడు, వాయిద్య కారుడు, వెరసి అభినవ వాగ్గేయకారుడు. మంచి ఆర్టిస్ట్. అతను వేసిన పేంటింగులకు ఐరోపా ఆర్ట్గ్యాలరీలలో స్థానం దక్కింది. అతను పోత పోసిన ఇనుప గేట్లు ఇంగ్లాండ్ పార్క్ లను అలంకరించాయి. డిలన్ కవిమాత్రమే కాక ఆత్మకథను రాసుకున్న రచయిత కూడా. Civil Rights, Anti-War Movements లో ఉద్యమ దుమారగీతమై పైకి లేచాడు.

అతని వ్యక్తిత్వంలో నిరంతరం చైతన్యం తొణికిసలాడుతుంటుంది – ఐతే కొన్ని సార్లు అది దుడుకు దూకుడుచైతన్యావేశం. దురుసుగా బైక్ నడిపి ప్రమాదం తెచ్చి పెట్టుకుని 18 నెలల పాటు మంచాన పడ్డారు. తాగిన మత్తులోవేదిక మీద అభాసపాలైన సందర్భాలు లేకపోలేదు. ఒక్క మంచి పాట రాసే ముందు వంద చెడ్డ పాటలుప్రదర్శించేందుకు వెనుకాడని తెగువ! అతను నిరంతరం కవితాత్మక తాదాప్యతలో (Poetic Muse) తలమునకలౌతుంటాడు. సాహిత్య సంగీత జీవనావరణంలో కొత్త పాటలను చెక్కుతుంటాడు. రాగాల, పదాలరూపురేఖలను మార్చుతూ కళాకేళిలో తేలిపోతుంటాడు. విప్లవ రాగాల స్వర మాంత్రికుడు బాబ్ డిలన్.

Some people feel the rain. Others just get wet అని విశ్వసించే భావుక డిలన్ ను ఆకాశానికి ఎత్తిన ప్రశంసలుకోకొల్లలు.
A singer worthy of a place beside the Greek bards, beside Ovid, beside romantic visionaries, beside the kings and queens of the blues, beside the forgotten masters of brilliant standards . – నోబెల్ కమిటీ.
Bob is the Voice of the Generation – Musical world.
His (Dylan’s) lyrics have changed the English Lexicon – Tod Perry.
డిలన్‌ను అనేక పురస్కారాలు వరించాయి. 12 Grammy Awards, Academy Award, Golden Glob Award, 2 గౌరవ డాక్టరేట్లు, Pulitzer Prize, Presidential Medal of Freedom, Nobel Prize అందులో కొన్ని మాత్రమే. 2016 లోసంగీత వాగ్గేయకారుడైన బాబ్ డిలన్ కు సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించడం యావత్ ప్రపంచాన్నే కాకడిలన్ కూడా అబ్బుర పరిచింది. గొప్ప అమెరికన్ సంగీతసాహిత్య సాంప్రదాయాలను సమన్వయించుకొని, ఒకఅపూర్వ అభివ్యక్తిని ఆవిష్కరించినందుకే ఈ పురస్కారం అని నోబెల్ కమిటీ ప్రకటించింది. తానుగాయకడినైనా, జన్మతః కవి నని, కవిగా జీవించి, కవిగానే మరణిస్తానని చెప్పుకున్నాడు. ఆయనలోని కవి ఆయనపాడిన ప్రతి పాటలో దర్శనమిస్తాడు. అందుకు నిదర్శనం ఇదిగో ఈ కొన్ని ఆతని కవితా గీతాలకు నాక్లుప్తానువాదాలు:
1. Every Grain of Sand –

ఈ విషాద నిశీథినిలో, ఈ దరంత వేసవుల దురిత స్వప్నాలలో,
ఈ కారునల్లని చలికారు కాంతిలో,
ఆకాశం లోకి అంతరిస్తున్న ఒంటరి నర్తనాలలో,
పగిలిన అద్దాలలో, విరిగిన విస్మృత ముఖాలలో
నేను చిరుగుల పేలికనై చిగురిస్తున్నాను.
మానవ వాస్తవికతల తూనికల త్రాసులో ఊగిసలాడుతున్నాను.
( ఈ కవితా శకలం పూర్తి పాఠం నా కవితా సంపుటి అనుస్వనం లో )
1. It’s All over Now, Baby Blue –

అంతా అయిపోయింది
వెళ్లిపోక తప్పదు ఓ నీలి కళ్ళ పిల్లా !
నీకు కావలసిందల్లా పట్టుకెళ్ళు త్వరగా.
చూడు … దూరాన తుపాకి పట్టుకొని
సూర్యునిలోని అగ్నిలా ఏడుస్తున్న అనాథను,
సాగివస్తూ చేరువౌతున్న సాధువులను.
రహదారి ఘరానా జూదరులది,
తెలివి తెచ్చుకొని మసలుకో,
రక్షించుకో కలిసివచ్చిన కాలంలో కూడగొట్టుకున్న దాన్ని.
నీ వీధి చివర
నీ వట్టి చేతుల చిత్రకారుడు గీస్తున్నాడు నీ పిచ్చి బొమ్మలను,
ముడుచుకుంటున్నది నీ కాలికింది నీలి నింగి.
రా ….నీవు ఎక్కి వచ్చిన అంచలంచెల మెట్లను,
నీవు మరచిన జీవతచ్ఛవాలను అక్కడే వదిలేసి;
నిప్పు పెట్టు నీ గతానికి,
మళ్లీ మొదలెట్టు కొత్త జీవితాన్ని.
అంతా అయిపోయింది
నిష్క్రమించక తప్పదు ఓ నీలి కళ్ళ పిల్లా !

1.Mr. Tambourine man –
హే! ఖంజరీ వాదకుడా!
గణగణ గంటల గలగలల వేకువలో
ఖంజరి మోగిస్తున్న తప్పెటగుళ్ల వైతాళికా!
పాడు నాకోసం ఓ పాట
నిదురరాని నాకోసం, గమ్యమే లేని నా కోసం;
ఎవరూ లేని ఏకాకిని నేను, నీ వెంటే వస్తా.
అలుముకున్న నా అలసట
నన్ను ఆశ్చర్య౦లో ముంచేస్తున్న ఈ చిరుచీకటి వేళ
నన్ను ఒంటరిని చేసి పాతేసింది
చేజారిన ఇసుక గరచిన రేతిరి సామ్రాజ్యం;
ఈ నిర్జీవ శూన్య వీధులలో
ఇంకేమీ మిగలలేదు స్వప్నించేందుకు.
తీసుకెళ్ళు నన్ను
సుళ్లుతిరిగే నీ మాంత్రిక నౌకలో,
ప్రసరించు నా త్రోవలలో
నీ మాదక నృత్య ఛాయలను.
గతితప్పుతున్నవి నా అంగాంగాలు,
ఆగు ఒకింత నా బూటు మడమ నిలదొక్కుకునే దాకా,
నేను రెడీ ఎక్కడికైనా వచ్చే౦దుకు,
నా కాలి నడకలో నేను కరిగిపోయేందుకు,
హే! ఖంజరీ వాదకుడా!
నన్ను వెంటేసుకు వెళ్లు
శిథిల కాలశకలాల పొగమంచు వలయాల గుండా,
బూచీ భయంతో వణకిపోతున్న బీచ్ వృక్షాల
నీహార శుష్క పత్రాల గుండా,
తీసుకెళ్ళు నింగి నీలిమల నీలాల నీడల కింది
సముద్ర ఛాయలు ఆవరించిన గారడీ రేణువుల ఆవరణల గుండా,
వివిధ స్మృతులు, విధిరాతలు తరిమిన
నీలినీటి కెరటాల లోతుల గుండా,
మతిచెడిన మంచు కోరలకు దూరంగా,
నా మస్తిష్క ధూమంలో నేను మాయమయ్యే దాకా;
మరిచి పోనీ నన్ను ఈ రోజును రేపటి దాకా.

1.Like A Rolling Stone –
ఆనాడు నీవు
జిలుగు వలువల్లో జిగేలుమంటూ
వగల కులుకుల సొగసు తళుకులను ఆరబోశావు కదూ
చపల చంచల మత్తకాశినీ! ఓ మదన కామినీ!
పతనమౌతావని వచ్చిన హెచ్చరికలను
ఖాతరు చేయలేదు కదూ ఓ రంగుల అంగడి బొమ్మా!
నీచుట్టూ తిరుగులాడిన వాళ్ళను ఈసడిస్తూ వుండే దానివే
ఇప్పుడేమైంది నీ గర్వాతిశయం ?
నెత్తిమీద నీడలేని, తిండికి గతిలేని ఒంటరీ!
దిగజారిన ఓ నిలకడలేని నీటిలోని గులకరాయీ!
గొప్ప గొప్ప బడులలో చదివిన రోజుల్లో వాళ్ళు
నీవు సరస ధారలో కరగడమే చూచారు కాని
వీధి బతుకునెలా ఈడ్చడమో నీకు నేర్పనే లేదు కదా
ఓ పతిత మదవతీ!
శూన్యదృక్కుల ఓ ఏకాకి తిరుగుబోతూ!
ఇప్పుడిక ఎవరూ లేరు నీకు పూచీకత్తు.
( ఈ కవన ఖండికల గీత మాధుర్యాన్ని ఆస్వాదించాలంటే ఆతని గాత్ర గమకాలను వినక తప్పదు. )
విప్లవ రాగాల స్వర మాంత్రికుడు డిలన్. Voice of the Generation డిలన్.
మన కాలపు మహా కళాకారుడు, అమెరికన్ అభినవ వాగ్గేయకారుడు, పాటై పారిన పాపులర్ కవి బాబ్ డిలన్‌డిలన్!

                                                                                                నాగరాజు రామస్వామి

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News