Home తాజా వార్తలు శ్రీశైలం పాతాలగంగలో మృతదేహం లభ్యo

శ్రీశైలం పాతాలగంగలో మృతదేహం లభ్యo

Body found at Srisailam Patalganga

మృతుడు మెదక్ జిల్లావాసి

మన తెలంగాణ/నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం డ్యామ్ సమీపంలోని లింగాలగట్టు పాతాళగంగలోని నీటిలో బుధవారం మృతదేహం గుర్తించారు. నీటిలో తెలాడుతున్న శవాన్ని గమనించిన మత్యకారులు నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్దలానికి చేరుకున్న ఈగలపెంట పోలీసులు నీటిలో ఉన్న మృతదేహన్ని బయటకు తీయించారు..మృతుడు మెదక్ జిల్లాకు చెందిన దోనిపుడి సాంబశివరావు(48)గా గుర్తించారు..మృతుడు గత నాలుగు రోజుల కిందట శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట గౌరిశంకర్ లాడ్జిలో రూమ్ నంబర్ 4 లో గది అద్దెకు తీసుకున్నట్లు పోలీసుల విచారణలొ తెలిందని తెలిపారు..నాలుగు రోజుల కిందట మృతుడు సాంబశివరావు శ్రీశైలం డ్యామ్ లింగాలగట్టు పాతాళగంగ బ్రిడ్జి పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు..మృతుని బందువులకు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఈగలపెంట పోలీసులు తెలిపారు.