Home తాజా వార్తలు బాలీవుడ్ నటుడు భూపేశ్ కుమార్ కన్నుమూత

బాలీవుడ్ నటుడు భూపేశ్ కుమార్ కన్నుమూత

Bollywood Actor Bhupesh Kumar Pandya Passed Awayముంబయి : ప్రముఖ బాలీవుడ్ నటుడు భూపేశ్ కుమార్ పాండ్యా బుధవారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన ఊపిరితీత్తుల కేన్సర్ తో బాధపడుతూ చనిపోయినట్టు నేష‌న‌ల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ ఎస్ డి) సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. భూపేశ్ కుమార్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో 2001 బ్యాచ్ విద్యార్థి. న‌టుడు మ‌నోజ్ బాజ్‌పేయి, గ‌జ రాజ్ రావ్‌, ద‌ర్శ‌కుడు ముఖేశ్ చాబ్రా తదితరులు భూపేశ్ కుమార్ కు నివాళి అర్పించారు. భూపేశ్ కుమార్ పాండ్యా ఆత్మకు శాంతి చేకూరాలని వారు ప్రార్థించారు. ఆయన మృతిపై విచారం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.విక్కీ డోనర్, పర్ మాణు వంటి పలు సినిమాల్లో నటించి భూపేశ్ కుమార్ పాండ్యా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వందకి పైగా నాటకాల్లో ఆయన నటించారు.