Home తాజా వార్తలు సంజయ్ దత్ ‘సడక్‌-2’ ట్రైలర్‌ విడుదల

సంజయ్ దత్ ‘సడక్‌-2’ ట్రైలర్‌ విడుదల

Bollywood Actor Sanjay Dutt Sadak-2 Trailer Releaseముంబయి : బాలీవుడ్ నటులు సంజయ్ దత్‌, ఆదిత్యారాయ్‌కపూర్‌  ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ’సడక్‌-2‘. ఈ సినిమాకు మహేశ్‌భట్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను బుధవారం విడుదల చేశారు. మంచి, చెడుకు మధ్య జరిగే ఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 28న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ లో ఈ సినిమాను విడుదల చేస్తారు. ఇంకా ఈ సినిమాలో పూజాభట్, అలియాభట్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ’సడక్-1‘ సినిమాలో మాదిరిగానే ’సడక్-2‘ లో కూడా సంజయ్ దత్ క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నారు. ఇదిలా ఉండగా సంజయ్ దత్ స్టేజ్-3 లంగ్ క్యాన్సర్ బారిన పడిన విషయం విదితమే.