Home గాసిప్స్ పూనమ్ పాండే… వివాహం ఎవరితోనో..?

పూనమ్ పాండే… వివాహం ఎవరితోనో..?

POONAMబాలీవుడ్ నటి పూనమ్ పాండేది రూటే సపూరేటు.. అందరు సెలబ్రిటీలు తమకు పాపులారిటీని సంపాదించుకునేందుకు ఎదోక రకంగా తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. అదే కోవకు చెందిన నటి పూనం పాండే. అయితే కాస్త వెరైటీగా తనకు పాపులారిటీని సాధించుకుంటుంది. కేవలం మూడే మూడు సినిమాల్లో నటించి యువ అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్న ఈ బాలీవుడ్ అమ్మడు తన అందచందాలను సామాజిక మాద్యమాల్లో పోస్టు చేసి కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోందట. దీంతో బ్రహ్మాండమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాదు ఏదోక ఆసక్తికరమైన వ్యాఖ్యలతో వార్తలకెక్కుతోందీ మాటల మరాఠి. ఇటీవల తన పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాన్ని సామాజిక మాధ్యమంలో రాసి వదిలింది. తన జీవితం సోషల్ మీడియా అయిన ‘ట్విట్టర్’తోనే ముడిపడిపోయిందని, అందుకే ట్విట్టర్ అనే పేరు గల వ్యక్తిని వివాహం చేసుకుంటానని ఓ ఆఫర్‌ను ప్రకటించిందీ ముద్దుగుమ్మ. దీంతో ముద్దుగుమ్మ ఇచ్చిన ఆఫర్‌ను అందుకునేందుకు వందలాది మంది అభిమానులు స్పందించారు. నా పేరు…ట్విట్టర్.. నన్ను పెళ్లి చేసుకుంటావా ? అంటూ కామెంట్లు అదిరిపోతున్నాయి. అయితే ఈ బ్యూటీ క్యూన్ భవిష్యత్తులో ఎవరికి వరిస్తుండో వేచి చూద్దాం.