Home సినిమా ఫిల్మ్‌మేకర్స్‌కు టెన్షనే

ఫిల్మ్‌మేకర్స్‌కు టెన్షనే

Alia Bhattఇప్పుడు బాలీవుడ్ మొత్తమ్మీద చాలా బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరంటే అలియాభట్. కళంక్, బ్రహ్మాస్త్ర, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, ఇన్షా అల్లా, ఆర్‌ఆర్‌ఆర్ తదితర సినిమాలు చేస్తోంది ఈ యంగ్ బ్యూటీ. అన్నీ భారీ ప్రాజెక్టులే. ఇన్ని ప్రాజెక్టులను లైన్‌లో ఉండడం ఆమె అభిమానులకు సంతోషమేమో కానీ అలియాను హీరోయిన్‌గా తీసుకున్న దర్శకులు, నిర్మాతలకు కాస్త టెన్షనే. ‘కళంక్’ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్‌లో ఉంది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ చిత్రంలో క్యామియో రోల్ కాబట్టి ఎక్కువ కాల్షీట్స్ అవసరం కావు. కానీ మిగతా భారీ సినిమాలకు అలియాభట్ డేట్స్ సర్దుబాటు చేయగలుగుతుందా, లేదా అనే అనుమానాలు ఉంటే తాజాగా ఆమె పర్వతారోహకురాలు అరుణిమ సిన్హా బయోపిక్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా కోసం ఆమె పర్వతారోహణంలో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతటితో అలియాభట్ కొత్త సినిమాలకు సైన్ చేయడం ఆపుతుందా, లేదా అనేది చూడాలి.

Bollywood Beauty Alia Bhatt Busy with Big Projects