Home జాతీయ వార్తలు బాలీవుడ్ దర్శకుడి కన్నుమూత

బాలీవుడ్ దర్శకుడి కన్నుమూత

Basu Chatterjee passes awayముంబయి : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు బసు ఛటర్జీ (90) గురువారం కన్నుమూశారు. కొంతకాలంగా ఛటర్జీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఛటర్జీ కన్నుమూసిన విషయాన్ని బాలీవుడ్ టివి, సినిమా డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ పండిట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సాంట్ క్రూజ్ స్మశాన వాటికలో ఈ రోజు సాయంత్రం ఛటర్జీ అంత్యక్రియలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఛటర్జీ కార్టూనిస్ట్ గా తన కెరీర్ ను ప్రారంభించారు. 1969లో వచ్చిన సారా ఆకాశ్ సినిమాతో ఛటర్జీ దర్శకుడిగా మారారు.  చోటీసీ బాత్, రజనీగంధ, బాతో బాతో మే, ఎక్ రుకాహువా ఫైసలా, చమేలీకి షాది తదితర సినిమాలు ఆయన  దర్శకత్వంలో వచ్చాయి. ఛటర్జీ  హిందీతో పాటు పలు బెంగాలీ సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. వాస్తవికతకు, సామాజిక అంశాలకు దగ్గరగా ఆయన సినిమాలు ఉంటాయి. బిగ్ బీ అమితాబ్ తో మంజిల్, రాజేశ్ ఖన్నాతో చక్రవ్యూహ్, దేవానంద్ తో మన్ పసంద్ సినిమాలను ఛటర్జీ రూపొందించారు. ఛటర్జీ తీసిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. బైస్కిల్ థీప్, బిల్లీ వైల్డర్ తదితర సోషియే రొమాంటిక్ కామెడీ సినిమాలు ప్రేక్షకుల ఆదరణను విపరీతంగా పొందాయి. 1992లో ఛటర్జీకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. పలు టివి సీరియళ్లకు కూడా ఆయన రాశారు. డైరెక్టర్ గానే కాకుండా మాటల, కథల రచయితగా కూడా ఛటర్జీ పేరు గాంచారు. ఆయన మృతిపై బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. బాలీవుడ్ కు ఛటర్జీ చేసిన సేవలు మరువలేనివని వారు కొనియాడారు.