Home తాజా వార్తలు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కు లంగ్ క్యాన్సర్

బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కు లంగ్ క్యాన్సర్

Bollywood Star Sanjay Dutt Suffering With Lung Cancerముంబయి : బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కు లంగ్ క్యాన్సర్ నిర్థారణ అయినట్టు బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయనకు కరోనా పరీక్షలు చేయగా, నెగిటివ్ వచ్చింది. అయితే సంజయ్ దత్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు లంగ్ క్యాన్సర్ వచ్చినట్టు బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. అయితే ఆయనకు లంగ్ క్యాన్సర్ చికిత్స చేస్తే నయమవుతుందని, ఈ క్రమంలో ఆయన అమెరికా వెళ్లి చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీనిపై సంజయ్ దత్ స్పందించారు. ప్రస్తుతం తాను చిన్నపాటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు ఆయన తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుని తన పని మొదలు పెడుతానని ఆయన స్పష్టం చేశారు. తన ఆరోగ్యం పట్ల ఎటువంటి ఆందోళన చెందవద్దని ఆయన అభిమానులను కోరారు. సంజయ్ దత్ భార్య,పిల్లలు ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారట. సంజయ్ దత్ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. సంజయ్ దత్ అనారోగ్యం నుంచి కోలుకోవాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.