Home అంతర్జాతీయ వార్తలు ఈజిప్టు, సోమాలియా, టర్కీలలో బాంబు పేలుళ్లు

ఈజిప్టు, సోమాలియా, టర్కీలలో బాంబు పేలుళ్లు

80 మందికి పైగా మృతి

కైరో, మెగదీషు, ఇస్తాంబుల్ : ఉగ్రవాదుల దుశ్చర్యలకు మూడు దేశాల్లో సామాన్యులు బలయ్యారు. ఈజిప్టు, సోమాలియా, టర్కీ దేశాల్లో ఆదివారం సంభవించిన బాంబుపేలుళ్ళలో 80 మందికి పైగా ప్రజలు మరణించారు. ఈ పేలుళ్లపై ఆయాదేశాల్లో దర్యాప్తు సంస్థలు విచారణ ప్రారంభించాయి.

ఈజిప్టు పేలుడులో 25 మంది మృతి

Bombattackఈజిప్టు రాజధాని కైరలోని ప్రధాన కాప్టిక్ క్రిస్టియన్ క్యాథెడ్రల్ సమీపంలో బాంబు పేలుడు సంభవించింది.  ఘటనలో 25 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నా రు. మరో 30 మందికి గాయాలయ్యాయి. గతంలో కూడా మైనార్టీ కమ్యూనిటిపై ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. అయితే పేలుడుకు తామే బాధ్యులమని ఇంత వరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించలేదు. కాగా, మధ్య కైరో అబ్బాసియా జిల్లాలోని  సెయింట్ మార్క్ క్యాథెడ్రల్  వద్ద ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రార్థనలు చేస్తున్న సమయంలో బాంబు పేలుడు జరిగిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. క్యాథెడ్రల్ ప్రహరీగోడ సమీపంలో ఉన్న చర్చిలోకి బాంబు దూసుకురావడంతో 25 మృతి చెందగా, 30 మందికి పైగా గాయపడ్డట్లు ఆరోగ్యశాఖ మంత్రి అహ్మద్ ఎమద్ తెలిపారు. టిఎన్‌టిలో తయారైన బాంబును రిమోట్ కంట్రోల్ ద్వారా పేల్చివేసిన ట్లు స్టేట్ టెలివిజన్  వెల్లడించింది. క్యాథెడ్రల్ లోపల అనేక మంది క్రిస్టియన్లు ప్రార్థనలు చేస్తున్న సమయంలో బాంబు పేలుడు సంభవించ డంతో బాధితుల  సంఖ్య భారీగా ఉందని ఆ ప్రకటనలో మంత్రిత్వశాఖ పేర్కొంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు అధికారులు తెలిపా రు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించామన్నారు. ఘటనాస్థలిని వద్ద భద్రతా బలగాలు పరిశిలిస్తున్నాయి.  క్యాథెడ్రల్ చుట్టపక్కల ఉన్న రోడ్లను మూసివేశారు. ఇదిలా ఉండగా దేశంలో ఈ వారంలో ఉగ్రవా దులు బాంబు పేలుళ్ల  పాల్పడడం ఇది మూడవసారి. ఈనెల  9న గిజా హారం జిల్లాలో జరిగిన పేలుడులో ఆరుగురు పోలీసులు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. అదే విధంగా కఫ్రా ఎల్-షెయిక్ అంతర్జాతీయ రోడ్‌లో బాంబు పేలుడు సంభవించి ఒక పౌరుడు మరణించగా, ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.

టర్కీలో జంట బాంబు పేలుళ్లు

టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో శనివారం ఓ ఫుట్‌బాల్ స్టేడియం సమీపంలో జంట బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనల్లో 38 మంది మరణించారు. దీంతో ఆదివారం జాతీయ సంతాపదినంగా టర్కీ ప్రకటించింది. అయితే కుర్దీష్ ఉగ్రవాదులే ఈ బాంబుదాడులకు పాల్పడినట్లు భావిస్తున్నామని పేర్కొంది. మొదటగా బేసిక్‌టాస్-బుర్సాస్పూర్‌ల మధ్య సూపర్ లీగ్ మ్యాచ్ జరిగిన ఫుట్‌బాల్ స్టేడియం బయట కారు బాబుపేలుడు జరగగా, నిమిషం వ్యవధి లోపలే ఓ పార్కు ఆవరణలో ఉన్న పోలీస్ గ్రూప్ సమీపాన ఆత్మాహుతి దళ సభ్యుడు తనకు తాను పేల్చుకున్నాడు. ఈ ఘటనలో 38 మంది మరణించడంతో వారికి సంతాప సూచకంగా జాతీయ జెండాను అవనత చేయాలని ప్రధాని బినాలి యిల్దీరిమ్ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా దేశ అధ్యక్షుడు రీసెప్ టయ్యిప్ ఎర్దోగన్ తన కజఖస్తాన్ ట్రిప్‌ను వాయిదా వేసుకున్నట్లు దేశ అధికారిక వార్తా సంస్థ అనడోలు వెల్లడించింది. పోలీసులను లక్షంగా చేసుకునే ఈ దాడులు జరిగినట్లు ఉప ప్రధానమంత్రి నూమన్ కుర్టుల్‌మస్ మీడియాకు తెలిపారు. కాగా, ఈ పేలుళ్లలో ఉగ్రవాదులు 300-400 కిలలో పేలుడు పదార్థాలను వాడినట్లు నిఫుణులు చెబుతున్నారు. జంట పేలుళ్లలో 30 మంది పోలీసులు, ఏడుగురు పౌరులు, ఒక గుర్తు తెలియని వ్యక్తి మరణించారని, మరో 155 మంది గాయపడ్డారని దేశ అంతర్గత వ్యవహారాల శాఖమంత్రి సులేమాన్ సోయులు చెప్పారు. ఈ ఘఠనల్లో ఇప్పటి వరకు 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఫోరెన్సిక్ బృందం ఆదివారం స్టేడియాన్ని, పార్కును పరిశీలించి ఆధారాలను సేకరిస్తున్నట్లు ఓ మీడియా ప్రతినిధి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే కుర్దిష్ తీవ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య గతకొంతకాలంగా హింసాత్మక ఘటనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కారుబాంబు, ఆత్మాహుతి దాడి వెనుక కర్దిష్ తీవ్రవాదుల హస్తం ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.

ఆత్మాహుతి బాంబుదాడిలో 20 మంది మృతి

సోమాలియా రాజధాని మొగదీషులో ఆదివారం ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. బాంబు ధాటికి 20 మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడింది తామేనని ఆల్ ఖైదాతో సంబంధాలు న్న షాబాబ్ గ్రూప్ ప్రకటించింది. ఈ ఘటనలో మృతి చెందిన వారు ఎక్కువగా సామాన్య పౌరులేనని సోమాలి పోలీస్ కమాండర్ ఇబ్రహీం మహమ్మద్ చెప్పారు. క్షతగాత్రులైన అనేక మందిని నగరంలో ఉన్న వివిధ ఆసుపత్రులకు తరలించారు. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. అయితే ఎంత మంది క్షతగాత్రులయ్యారనేది స్పష్టం కాలేదు. అయితే తమ సిబ్బంది గాయపడిన 48 మందిని ఆసుపత్రికి తరలించిట్లు ఎఎంఐఎన్ అంబులెన్స్ సర్వీస్ డైరెక్టర్ అబ్దికదర్ అబ్దిరహమాన్ అడెం చెప్పారు. ఆత్మాహుతి దళ సభ్యుడు సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాన్ని లక్షంగా చేసుకుని ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడ్డాడని ఆయన  తెలిపారు. ఆ ప్రాంతంలో కూలీలు, ఇత చిన్న వ్యాపారులు నివసిస్తున్నారన్నారు. కాగా, మొగదీషు గర శివార్లలోని రద్దీగా ఉండే ఓడరేవు వద్ద భారీ పేలుడు సంభవించినట్లు తాము విన్నామని స్థానికులు వెల్లడించారు. పేలుడు ధాటికి దట్టమైన పొగ ఆకాశాన్నంటడాన్ని తాము చూశామని చెప్పారు. ఘఠనపై దర్యాప్తు జరుగుతున్నట్లు నగరపాలక  ప్రతినిధి అబ్దిఫట్హా ఒమర్ హలేన్ చెప్పారు. ఇదిలా ఉండగా, ఆత్మాహుతి దాడికి పాల్పడింది దామేనని షాబాబ్ ఉగ్రవాద సంస్థ తన టెలిగ్రామ్ మెసేజింగ్ అకౌంట్ ద్వారా ఒక ప్రకటనను విడుదల చేసింది. పోర్టు దగ్గరలో ఉన్న మిలిటరీ బేస్‌ను లక్షాంగా చేసుకుని దాడికి పాల్పడినట్లు పేర్కొంది.