Home తాజా వార్తలు గచ్చిబౌలిలో బాంబు కలకలం

గచ్చిబౌలిలో బాంబు కలకలం

Bomb

 

హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి పరిధి ఇంద్రానగర్‌లో బాంబు కలకలం సృష్టించింది. ఓ హోటల్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి బాక్సు వదిలి వెళ్లడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో పోలీసులు అక్కడికి చేరుకొని ఆ ప్రాంతం అంతా తనిఖీ చేశారు. ఆ బాక్సులో ఉన్నవి బల్బులు అని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో ఆ బాక్స్ ను స్వాధీనం చేసుకొని, ఈ క్రమంలో టిఫిన్ బాక్స్‌లో బల్పులు ఎవరు పెట్టారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆ హోటల్ చుట్టు పక్కల ఉన్న 30 సిసి కెమెరాలలోని ఫుటేజిని పోలీసులు పరిశీలిస్తున్నారు.

Bomb searching in Gachibowli