Friday, March 29, 2024

ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు..చివరకు క్షమాపణ

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: ఇక్కడి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి(ఊజిఐ) 2022 డిసెంబర్ 31వ తేదీ ఉదయం సోషల్ మీడియా వేదికగా వరుసగా బాంబు బెదిరింపునకు సంబంధించిన మెసేజ్‌లు రావడం మొదలయ్యాయి. అయితే చివరకు అది బూటకపు బాంబు బెదిరింపని స్వయంగా మెసేజ్‌లు పంపిన వ్యక్తే చెప్పి క్షమాపణ కూడా కోరాడు. డిసెంబర్ 31వ తేదీ ఉదయం 8.39 గంటలకు నుంచి దయం 10.40 వరకు ఐజిఐ అధికారికి ట్విటర్ అకౌంట్‌కు వరుసగా బాంబు బెదిరింపు మెసేజ్‌లు రావడంతో అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు విమాశ్రయంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.

అయితే..ఉదయం 10.40 గంటలకు పంపిన చివరి మెసేజ్‌లో ఆ గుర్తు తెలియని వ్యక్తి తాను నిజాయితీగా క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నాడు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఐజిఐకి చెందిన సోషల్ మీడియా ఖాతాలను పర్యవేక్షించే అధికారులు ఢిల్లీ పోలీసులకు ఆ గుర్తు తెలియని వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. ఆ గుర్తు తెలియని వ్యక్తి పంపిన బాంబు బెదిరింపు మెసేజ్‌ల పర్యవసానంగా భీతావహ పరిస్థితి ఏర్పడిందని, విమానాశ్రయంలో బాంబు కోసం తనిఖీలు కూడా నిర్వహించడం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News