Home తాజా వార్తలు వర్షాలు కురుస్తయ్

వర్షాలు కురుస్తయ్

Bonalu

రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది – రంగంలో స్వర్ణలత భవిష్యవాణి

మన తెలంగాణ / సికింద్రాబాద్ : ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజా ము నుండి నిరంతరాయంగా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం లో మొదటి రోజు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనా లు సమర్పించారు. అనంతరం రాత్రి అమ్మవారి పలహారం బండి ఊరేగింపు జరిగింది. పలహారం బండి ఉరేగింపులో భక్తులు ఆధిక సంఖ్యలో పాల్గొన్నారు. పోతురాజుల నృత్యాలు, శివసత్తుల వి న్యాసాలతో రాత్రి ప్రారంభమైన ఊరేగింపు తెల్లవారు జాము వరకు కొనసాగింది. బోనాల ఉత్సవాల్లో కీలకమైన రంగం కార్యక్రమాన్ని సోమవారం ఉద యం 10 గంటలకు నిర్వహించారు. రంగంలో అమ్మవారి భక్తురాలు స్వర్ణల త భవిష్యవాణి వినించారు. ఈ సందర్భంగా భక్తులు అడిగే ప్రశ్నలకు స్వర్ణలతలో ఆవహించిన మహంకాళి అమ్మవా రు సమాధానాలు చెప్పారు. అమ్మవారికి అభిముఖంగా ఉన్న మాతంగి ఆలయం వద్ద స్వర్ణలత పచ్చికుండపై నిలబడి అ మ్మవారిని ఆవహింపజేసుకున్నారు. ఆ మె వైపు చూస్తూ భవిష్యత్తులో జరిగే పరిణామాలను ముఖ్య విషయాలను వెల్లడించారు. ఈ ఏడాది నా ప్రజలందరూ సంతోషంగా ఆలయానికి వచ్చి మొక్కు లు, ముడుపులు చెల్లించుకున్నారు. నేను కూడా వారి పూజలతో సంతోషించానని ఆవహించిన అమ్మవారు అన్నారు.

నా అక్కచెల్లెళ్లు ఆనందంగా ఉంటే తాను సంతోషమేనని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారని వెల్లడించారు. ప్రజల కోరికలన్ని తీరుతాయని పూజలతో సం తృప్తి చెందానని అన్నారు. ఏటా భక్తులు తన వద్దకు సంతోషంగానే వస్తున్నారని అయితే ఈ సారి మాత్రం ఆనందమే లే కుండా పోయిందెందుకని అని ప్రశ్నించారు. ప్రతి ఏటా తప్పనిసరిగా బోనా లు సమర్పించాలన్నారు. ఐదు వారాల పాటు తనకు శాకను సమర్పించాలని భక్తులకు సూచించారు. తన ప్రజలను కాపాడటం తన బాధ్యత అన్నారు. ఈ సంవత్సరం రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వర్షాలు విస్తారంగా కురుస్తాయన్నారు. వర్షాకాలం సగం దాటిపోయిందని వర్షాలు సక్రమంగా పడలేదని భక్తు లు అడిగిన ప్రశ్నకు వర్షాలు తప్పకుం డా కురుస్తాయి కాని తనకు వారం రోజులు మారు పూజలు ఎందుకు ఆపారని భక్తులను ప్రశ్నించారు. నా ప్రజల ను సంతోషపెట్టే బాధ్యత తనదేనన్నారు. నా సోదరి గంగాదేవికి జలాభిషేకం చేసి బోనం సమర్పిస్తే తప్పకుండా వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఐదు వారాల పాటు పప్పు, బెల్లాలు పలహారాలతో తనకు శాకలు సమర్పించాలని అమ్మవారు పేర్కొన్నారు. మొత్తంగా రాష్ట్రం శుభిక్షంగా ఉంటుందని , వర్షాలు కురుస్తాయని , తన ప్రజలకు ఆపద రానివ్వబోనని వారిని కాపాడే బాధ్యత తనదేనని అమ్మవారు హామీ ఇచ్చారు. కాకపోతే మారుబోనం తప్పకుండా తీయాలని ఆదేశించారు. రంగం కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ , రాంగోపాల్‌పేట్ కార్పొరేటర్ అతెల్లి అరుణ శ్రీనివాస్‌గౌడ్, ఆలయ ఇవో అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Bonalu Celebrations In Ujjaini Mahankali Temple