- Advertisement -
మన తెలంగాణ/చిన్నశంకరంపేట ః చిన్నశంకరంపేట మండల కేంద్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారము నాడు రాత్రి సర్పంచ్ కుమార్‌గౌడ్ ఇంటి నుండి డిప్యూటిస్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి బోనం ఎత్తుకొని గ్రామంలోని పోచమ్మ అమ్మ వారికి బోనాలను సమర్పించారు. శుక్రవారము నాడు శివపార్వతుల కళ్యాణం అంగరంగవైభవంగా జరిగింది. అనంతరం సర్పంచ్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -