Thursday, April 25, 2024

ఎముకలకు బలాన్నిచ్చే విటమిన్ ‘కె’

- Advertisement -
- Advertisement -

 

జర్మన్ భాషలో koagulation అంటే గడ్డకట్టడం అని అర్థం. ఈ విటమిన్ ముఖ్య బాధ్యత రక్తాన్ని గడ్డకట్టించడం అని జర్మన్ పరిశోధకులు కనుగొనడంతో ఆ పదంలోని మొదటి అక్షరం స్థిరపడిపోయింది. మన శరీరానికి చిన్న గాయమైనా సరే… అక్కడ రక్తం కనుక గడ్డకట్టకపోతే ఇక మనిషికి మరణమే శరణ్యం! ఆ పరిస్థితిని అదుపుచేసేందుకు కొన్ని ప్రొటీన్లు అక్కడి రక్తం గట్టిపడేలా చేస్తాయి. ఆ ప్రొటీన్లకి విటమిన్ కె తగిన బలాన్ని చేకూరుస్తుంది. నెలలు నిండకుండా పుట్టే పిల్లల్లో చాలా తక్కువ మోతాదులో ఈ విటమిన్ కనిపిస్తుంది. ఈ కారణంగా వారిలో అంర్గత రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. అందుకని పసిపిల్లలు పుట్టిన వెంటనే ఇంజక్షన్ రూపంలో కె విటమిన్‌ను అందిస్తారు వైద్యులు. ఎముకలకి తగినంత కాల్షియం అందిస్తూ, అవి పెళుసుబారిపోకుండా, దృఢంగా ఉండేలా కె విటమిన్ సాయపడుతుంది. పురుషులు రోజుకి 120 మి.గ్రాములు, స్త్రీలు రోజుకి 90 మి.గ్రాముల విటమిన్ కె ఉండే ఆహారం స్వీకరించాలనీ ఆరోగ్య సంస్థలు సూచిస్తున్నాయి. ఆకుకూరలు, మాంసా హారం, సోయాబీన్స్, పాలపదార్థాలు, కోడి గుడ్డు, బాదం, అక్రోట్స్, పొద్దు తిరుగుడు పువ్వు గింజలు, చిలగడ దుంప, బీట్‌రూట్, మా మిడి పండు, బొప్పాయి, సొరకా యలాంటి వాటిలో ఇ విటమిన్ సమృద్ధిగా లభిస్తుంది.

 

Bones are very Strong with Vitamin K
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News