Home తాజా వార్తలు బొక్కల కంపెనీ ఎత్తివేయాలి…

బొక్కల కంపెనీ ఎత్తివేయాలి…

Bones Company

 

గ్రామ సరిహద్దు ప్రాంతాల ప్రజల ధర్నా

యాచారం: యాచారం మం డల పరిధిలోని తక్కల్లపల్లి,కొత్తపల్లి గ్రామ సరిహద్దులో ఉన్న కిసాన్ ఆగ్రో పీడ్స్ అనే పేరుతో కొనసాగుతున్న బొక్కల కంపెనీని తక్షణమే ఎత్తివేయాలని ఆయా గ్రామాల ప్రజలు ఆదివారం పెద్ద ఎత్తున సదరు కంపెనీ వద్ద ఆందోళన చేపట్టారు. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా పశువుల కళేబరాలు, బొక్కలు, పశుమాంసంతో నూనె తయారు చేస్తున్నారు. కంపెనీ నుంచి వెలువడే విపరీతమైన దుర్వాసన వల్ల తక్కళ్లపల్లి పరిసర పాంతాలతో పాటు సమీపంలోని కొత్తపల్లి, కిషన్‌పల్లి, తమ్మలోని గూడ వాసులు రోగాల బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇప్పటికే అనేక మంది వాంతులతో పాటు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల పాలైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చుట్టుపక్కల వారు అక్కడ వెలువడే దుర్వాసన భరించలేక తమ వ్యవసాయ పొలాలకు కూడా వెళ్లడం లేదని పలువురు వాపోతున్నారు.గతంలో దీనిపై నిరసన తెలుపగా స్పందించిన నాటి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవ తీసుకొ ని సదరు కంపెనీని మూయించి వేశారని, కాని కంపెనీ యాజమాన్యం తమ రాజకీయ ప్రాబల్యంతో తిరిగి తెరిపించుకొన్నారని ప్రజలు ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం జేస్తున్నారు.

ఇప్పటికైనా ప్రజలకు ఇబ్బందులు కలిగించే కంపెనీని తక్షణమే మూసి వేయాలని తక్కళ్లపల్లి సర్పంచ్ కంబాలపల్లి సంతోష రమేష్,ఉప సర్పంచ్ పగడాల శ్రీశైలం డిమాండ్ చేశారు.ధర్నాలో వార్డు సభ్యులు బొజ్జ వెంకట్ రెడ్డి,సత్యనారాయణ,రాఘవేందర్,పుల్లమ్మ,దశరథతో పాటు స్థానిక పెద్దలు,యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Bones Company should be lifted