Friday, March 29, 2024

గంగూలీ, జై షాలకి ఊరట..

- Advertisement -
- Advertisement -

Boost for Ganguly and Jay Shah in Supreme Court

న్యూఢిల్లీ: భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బిసిసిఐ కార్యదర్శి జై షాలకు పెద్ద ఊరట లభించింది. బిసిసిఐ రాజ్యాంగ సవరణ, అధ్యక్ష, కార్యదర్శుల పదవీ కాలం పొడిగింపు తదితర అంశాలపై బిసిసిఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఆగస్టు 17న తిరిగి విచారణ ప్రారంభిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే, జస్టిస్ నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. దీంతో అప్పటి వరకు గంగూలీ, జై షాలు తమ తమ పదవుల్లో కొనసాగేందుకు మార్గం సుగమం అయ్యింది. అంతేగాక త్వరలో జరిగే ఐపిఎల్ పాలక మండలి సమావేశంలో పాల్గొనేందుకు వీరికి లైన్ క్లియర్ అయ్యింది. కాగా, జై షా పదవి కాలం గత మేలోనే ముగిసింది. కాగా, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీల పదవి కాలం ఈ నెల 27తో ముగియనుంది.

ఇక, కోర్టు తీర్పుతో వీరిద్దరూ మరి కొన్ని రోజుల పాటు పదవుల్లో కొనసాగేందుకు అవకాశం ఏర్పడింది. ఇదిలావుండగా బిసిసిఐ రాజ్యాంగం ప్రకారం ఎవరూ కూడా వరుసగా ఆరేళ్ల పాటు పదవుల్లో కొనసాగేందుకు వీలు లేదు. జై షా, గంగూలీలు ఇప్పటికే ఆరేళ్లు పూర్తి చేసుకున్నారు. దీంతో వీరు తమ తమ పదవుల్లో కొనసాగేందుకు వీలు లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో తమ రాజ్యాంగంలో సవరణలు చేస్తూ బిసిసిఐ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీని ఆమోందం కోసం సుప్రీం కోర్టులో బిసిసిఐ పిటిషన్ వేసింది. ఇక, ఈ పిటిషన్‌పై విచారణను దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగస్టు 17కు వాయిదా వేసింది.

Boost for Ganguly and Jay Shah in Supreme Court

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News