Saturday, April 20, 2024

ఇండియాతోనే కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి

- Advertisement -
- Advertisement -

Boris johnson about India key role in Covid vaccine

 

బ్రిటన్ ప్రధాని బోరిస్ స్పందన

లండన్ /న్యూయార్క్ : కోవిడ్ వ్యాక్సిన్ ప్రపంచ ప్రజలకు అందుబాటులోకి తేవడంలో భారతదేశపు పాత్ర ఘననీయంగా ఉందని బ్రిటన్‌ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రశంసించారు. ఉత్పత్తి దీనికి తోడుగా అందరికీ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవడం చాలా కీలకమైన విషయమని తెలిపారు. ప్రస్తుత ఐరాస సర్వ ప్రతినిధి సభ ను ఉద్ధేశించి జాన్సన్ వీడియో సందేశం వెలువరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ వ్యాక్సిన్ గురించి చేసిన ప్రసంగంలోని అంశాలను జాన్సన్ ప్రస్తావించారు. బ్రిటన్‌లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. తమ దేశపు ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ తయారీకి జరుగుతున్న కృషిని కూడా బ్రిటన్ ప్రధాని గుర్తుచేశారు. ఏ వ్యాక్సిన్ బాగా ఉపయుక్తం అయినా ముందు అది అందరికీ అందుబాటులోకి రావడం కీలకం. ఇందుకు తగ్గట్లుగా సరైన కోటాలో ఉత్పత్తి అవసరం అని స్పష్టం చేశారు.

యావత్తు ప్రపంచపు ఆరోగ్యం సురక్షిత, సమర్థవంతమైన వ్యాక్సిన్ లభ్యతపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఏ దేశం వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసిందనే దానికన్నా ఇది ఏ మేరకు అందరికీ అందుబాటులోకి సత్వర రీతిలో వచ్చిందనేది కీలకమని జాన్సన్ తెలిపారు. ఈ సందర్భంగా భారత దేశం కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో చేస్తున్న కృషి అభినందనీయం అని జాన్సన్ కొనియాడారు. ప్రస్తుతం అనేక కోవిడ్ వ్యాక్సిన్‌ల తయారీలు జరుగుతున్నాయి. ఇందులో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ఇప్పుడు అత్యంత కీలకమైన మూడవ దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉందని బ్రిటన్ ప్రధాని గుర్తు చేశారు. అస్ట్రా జెనెకా లక్షలాది డోసుల తయారీకి దిగిందని, అంతేకాకుండా భారత్‌లోని సీరం ఇనిస్టూట్‌తో భారీ స్థాయిలో వందకోట్ల డోసుల వ్యాక్సిన్‌ను రూపొందించేలా ఒప్పందం కుదుర్చుకుందని, అనుకున్న స్థాయిలో ఉత్పత్తి జరిగితే స్వల్పాదాయ, మధ్యస్థ ఆదాయ దేశాలకు వ్యాక్సిన్ చౌకగా అందుబాటులోకి వస్తుందని బ్రిటన్ ప్రధాని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News