Saturday, April 20, 2024

తొలిసారి గర్భస్థ శిశువుకు బ్రెయిన్ సర్జరీ!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బోస్టన్ డాక్టర్లు 34 వారాల రెండు రోజుల గర్భస్థ శిశువుకు గర్భాశయంలో ఇదివరకెన్నడూ చేయని మెదడు శస్త్ర చికిత్స(బ్రెయిన్ సర్జరీ) చేశారు. ఈ విషయాన్ని మెడికల్ జర్నల్ ప్రచురించింది. ‘గాలెన్ వైకల్యం సిర’ అని కూడా ఈ స్థితిని పిలుస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం మెదడు నుంచి గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళం సరిగ్గా అభివృద్ధి చెందనప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వైకల్యం తర్వాత సిర, గుండెపై ఒత్తిడి పెంచుతుంది. చివరికి మరణించే ప్రమాదం కూడా ఉంటుంది.

ఈ బ్రెయిన్ సర్జరీ గర్భాశయ శస్త్ర చికిత్స వలే నిర్వహిస్తారు. శిశువు డెన్వర్ కోల్‌మన్‌కు మార్చిలో చికిత్స చేయడానికి ప్రపంచంలోనే మొదటిసారిగా అల్ట్రాసౌండ్‌గైడెడ్ విధానాన్ని ఉపయోగించారు. దీని రిపోర్టు ‘జర్నల్ స్ట్రోక్’ లో ప్రచురించబడింది.
డెన్వర్ తల్లిదండ్రులు లూసియానాకు చెందిన డెరెక్, కెన్యాట్టా కోల్‌మాన్. గర్భం దాల్చిన ఆరవ నెలలో సాధారణ అల్ట్రాసౌండ్ చెకప్‌లో శిశువు పరిస్థితి, పుట్టాక ఎదుర్కొనే సవాళ్ల గురించి తెలుసుకున్నారు. ‘పదమూడవ వారంలో శిశువు మెదడుపరంగా ఏదో సరిగ్గా లేదని డాక్టరు నాతో చెప్పారు. శిశుశు గుండె కూడా పెద్దదయిందన్నారు’ అని చెప్పారని కెన్యాట్టా నాటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

పరిశోధన, పరీక్షల అనంతరం వైద్యులు పిండానికి ‘విఓజిఎం’ ఉందని నిర్ధారించారు. మార్చి 15న ఈ శస్త్ర చికిత్స జరిగినట్లు కెన్యాట్టా తెలిపింది. బ్రిగ్‌హామ్ అండ్ విమెన్స్ హాస్పిటల్‌లోని మెటర్నల్‌ఫిటల్ మెడిసిన్ అండ్ రిప్రోడక్టివ్ జెనెటిక్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ లూయిస్ విల్కిన్స్‌హాగ్ నేతృత్వంలో వైద్యుల బృందం మునుపెన్నడూ చేయని గర్భాశయంలోని గర్భస్థ శిశువుకు ఈ బ్రెయిన్ సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత రెండు రోజులకు శిశువు జన్మించింది. ఆసుపత్రి రికార్డుల ప్రకారం ఎటువంటి లోపాలు, సమస్యలు లేకుండా శిశువు డెన్వర్ కోల్‌మన్ జన్మించింది. కాగా నాలుగు పౌండ్ల బరువుతో పుట్టింది. రెండు నెలల తర్వాత బాగానే తింటోంది, నిద్రపోతోందని సమాచారం.

Ultra-sound film

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News