Home లైఫ్ స్టైల్ బొటానికల్ గార్డెన్‌

బొటానికల్ గార్డెన్‌

పర్యాటక ప్రాంతంగా రూపాంతరం 

 త్వరలోనే వినియోగంలోకి తేనున్న అటవీ అభివృద్ధి సంస్థ
 నగరవాసుల టూరిస్టు కేంద్రంగా ఏర్పాటైన గార్డెన్
 అర్బన్ ఫారెస్టు పార్కులో భాగంగా అభివృద్ధి

bear

నగరంలో అర్బన్ పార్కులపై దృష్టిపెట్టిన ప్రభుత్వం బొటానికల్ గార్డెన్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతోంది. రాష్ట్రంలోని పలు అటవీ ప్రాంతాలను ఎకో టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకూ కార్యాచరణను సిద్ధంచేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులను విడుదల చేయడంతో పాటు ఏ విభాగం ఎన్ని పార్కులను ఎక్కడెక్కడ అభివృద్ధి చేయాలనేదానిపై స్పష్టత నిచ్చింది. ఆ ఆలోచనలో భాగంగా అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌కు ప్రభుత్వం నాలుగు పార్కులను అప్పగించింది. నగరంలోని బొటానికల్ గార్డెన్ అందులో ఒకటి. ఈ గార్డెన్‌కు కొత్త మెరుగులు దిద్ది కార్పొరేషన్ అధికారులు త్వరలోనే ప్రజల కోసం వినియోగంలోకి తేనున్నారు.

మన తెలంగాణ/ హైదరాబాద్: దాదాపు పదేళ్లకిందటనే ఉనికిలోకి వచ్చిన బొటానికల్ గార్డెన్‌పై ఇంతకాలం ఆలనాపాలనా కరువవడంతో దాదాపు అడవిని తలపించే తీరులో తయారైంది. తెలంగాణ ఏర్పా టు తర్వాత ఈ పార్కు అభివృద్ధి బాధ్యతలను అటవీ అభివృద్ది కార్పొరేషన్ చేపట్టింది. బొటానికల్ గార్డెన్‌కు కొత్త అందాలు సమకూరాయి. ప్రజలకు ఆహ్లాదం, ఆనందం, విజ్ఞానంతో పాటు వికాసాన్ని కల్పించేందుకు వీలుగా కార్పొరేషన్ కొన్ని సౌకర్యాలు కల్పించింది. రోజురోజుకూ కాంక్రీట్ జంగిల్ మారుతున్న నగర ప్రజలకు కనీసం వారాంతంలోనైనా కుటుంబంతో కలిసి సేద తీరేందుకు వీలుగా ఈ గార్డెన్‌ను తీర్చిదిద్దింది. అన్ని వయసులకూ ఉపయోగపడే విధంగా సౌకర్యాలు చోటుచేసుకున్నాయి. పిల్లల ఆటపాటల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఇటీవలే ఐదు కోట్ల రూపాయలను వెచ్చించి సుందరంగా, ఆహ్లాదంగా పర్యాటక కేంద్రంగా అటవీ అభివృద్ధి కార్పొరేషన్ అభివృద్ధి చేసింది. ఒక ప్రైవేటు కంపెనీ దీని నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. యోగా సెంటర్ తో పాటు ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ దీని ప్రత్యేకత అని గార్డెన్ నిర్వాహకులు వ్యాఖ్యానించారు.
దృశ్య శ్రవణ విజ్ఞాన కేంద్రం

grd
ఇందుకోసం ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన టీవీల ద్వారా ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్‌పై అవగాహన కల్పించనున్నారు. ఇందులోనూ జంతు సంరక్షణ, వన సంరక్షణతో పాటు పక్షులు, జంతువులకు సంబంధించిన అంశాలను టీవీల ద్వారా ప్రత్యేకంగా తరగతుల నిర్వహించి వివరించనున్నారు. ఇందుకోసం కూడా ప్రత్యేక ఫీజును వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఎడారి మొక్కల వనం, హెర్బల్ గార్డెన్
గార్డెన్ ఏడాది మొక్కలతో పాటు హెర్బల్ మొక్కల పెంపకాన్ని ప్రత్యేకత సంతరించుకుంది. బయట ఏ పార్కులో ఈ తరహా మొక్కలు కనిపించవు. ఇందులో వీటికి ప్రత్యేక స్థానాన్ని కల్పించారు. ఏడారి, హెర్బల్ కోసం ప్రత్యేక సెక్షన్లను ఏ ర్పాటు చేశారు. ఏడారి మొక్కలను ఒక చోట ఏర్పా టు చేసిన అధికారు లు, 67 రకాల హెర్బల్ మొక్కలతో హెర్బల్ గార్డెన్‌ను కూడా సరఫరేట్‌గా ఏర్పాటు చేశారు. వీటి సందర్శనకు ఎలాంటి రుసుం లేదని అధికారులు వివరించారు.
కాటేజీలు, గజబోలు

grdn
కుటుంబ సమేతంగా వచ్చే వారి కోసం గుడిసె తరహాలో గజబోలను ఏర్పా టు చేశారు. కుటుంబ సభ్యులంతా అక్కడే విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఇందులో రెండు గజబోల ఆహ్లాదకర వాతావరణం కలిగేలా రూపొందించారు. వీటితో పాటు మరో కాటేజీలను ఏర్పాటు కూడా నిర్మించారు. వీటిని టెంట్, లాంగ్, ట్రీ హట్‌ల పేరుతో విశ్రాంతి గదులను ఏర్పాటు చేశారు. ప్రత్యేక రుసుంతో వాటిని ఏర్పాటు సందర్శకులకు కేటాయించనున్నట్లు అధికారులు చెప్పారు.
మంచె, టవర్ నెట్, ఇన్‌డోర్, అవుట్ డోర్ గేమ్స్
ఈ గార్డెన్‌లో మంచెను ఏర్పా టు చేశారు. రెండు మంచాలను ఏర్పాటు చేసిన అధికారులు పిల్లలకు గ్రామీణ వాతావరణాన్ని అందించేందుకు, పెద్దలు కూడా ఆ తరహా ఆనుభూతిని పొందేందుకు వీలుగా ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. టవర్ నెట్‌ను కూడా పిల్లల కోసమే ఏర్పాటు చేసిన అధికారులు అడ్వంటరల్ స్పోర్ట్ కు సంబంధించిన ఆట వస్తువులతో పిల్లలకు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించారు. దీంతో పాటు ఇండోర్ గేమ్స్‌తో పాటు అవుట్‌డోర్ గేమ్స్ ను ఆడుకునేందుకు కూడా సౌకర్యాలు కల్పించారు. ఇండోర్ గేమ్స్‌కు రుసుం కేటాయించేలా చర్యలు తీసుకుంటున్న అధికారులు అవుట్‌డోర్ గేమ్స్‌కు ఉచితంగా ఆడుకునే సౌకర్యం కల్పిస్తున్నారు.
బాంబూ హౌస్ ఏర్పాటు
కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించిన వెదురు పరిశ్రమ, ఉత్పత్తులతో పాటు ఇతర అంశాలకు సంబంధించి సమావేశాలు, సదస్సుల నిర్వహణ కోసం ప్రత్యేక వసతులతో నిర్మించారు. దీంతో పాటు ఆటవీ వస్తువుల విక్రయ కేం ద్రం, పార్టీ జోన్, బోటింగ్ సౌకర్యమే కాకుండా పార్టీ జోన్ కేఫ్‌టేరియా (క్యాంటీన్)లను అత్యాధునిక వసతులను ఏర్పాటు చేశారు. చూడ ముచ్చటగా ఉన్న ఈ గార్డెన్‌ను త్వరలోనే అందుబాటులోకి రానుంది. నగరంలో ఇటువంటి సౌకర్యాలతో మరో పార్కు లేదని, బొటానికల్ గార్డెన్‌కు సందర్శకుల తాకిడి అత్యధికంగా ఉంటుందనే ఆశాభావాన్ని అధికారులు వ్యక్తం చేస్తుండడం విశేషం.

వాకింగ్ ట్రాక్

ph1

ఉదయం, సాయంత్రం వేళల్లో సందర్శకులకు వాకింగ్ కోసం ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. మూడున్నర కిలోమీటర్ల పొడవున్న ఈ ట్రాక్‌లో అందరూ వాకింగ్ చేసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. ఇందుకోసం నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది కాలం కాల వ్యవధిలో పాస్‌లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ధరల విషయంలో ఇంకా నిర్ణయానికి రాలేదని అధికారులు తెలిపారు.