Home రాష్ట్ర వార్తలు ఇద్దరూ రాజకీయ వ్యభిచారులే

ఇద్దరూ రాజకీయ వ్యభిచారులే

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
chada-venkareddyమన తెలంగాణ/ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి: గతంలో కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీ నాయకులను చేర్చుకుంటే తప్పు లేనిది తాము చేర్చుకుంటే తప్పేంటని సిఎం కెసిఆర్ అనడంతో రెండు పార్టీలు రాజకీయ వ్యభిచారులే అని తేటతెల్లం అవుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. శనివారం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన ఆదిలాబాద్‌లోని ఎసియు భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో కాంగ్రెస్, ప్రస్తుతం టిఆర్‌ఎస్ పార్టీలు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యాన్ని భూ స్థాపితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయింపు చట్టాలు ఉన్నా ప్రభుత్వాలు వాటిని సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జెఎసి చైర్మన్ కోదండరామ్‌ను అభిమానించిన కెసిఆర్ ఇప్పుడు స్వరాష్ట్రం ఏర్పాడిన తరువాత ఆయన్ను విమర్శించడం సరికాదన్నారు. చార్జీలను పెంచమని ఎన్నికల ముందు చెప్పిన కెసిఆర్ ఇప్పుడు చార్జీలను పెంచడమ సమాంజసమేనా అని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులపై ప్రభుత్వం దౌర్జన్యం చేస్తుందని, వారికి అండగా సిసిఐ పార్టీ అండగ ఉంటుందని చాడ పేర్కొన్నారు. గిరిజనుల పక్షన ప్రత్యేక పోరాటలు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు.