Home తాజా వార్తలు బౌన్సర్ల వీరంగం…

బౌన్సర్ల వీరంగం…

 

Bouncers

 

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని అమ్నీషియా పబ్‌లో బౌన్సర్లు వీరంగం సృష్టించారు. మిత్రుడి పుట్టిన రోజు వేడుకులకు వెళ్లిన యువకులు వాష్ రూమ్ లో చేతులు తుడుచుకుంటుండగా నాప్కిన్ బాక్స్ కిందపడ్డాయని యువకులను బౌన్సర్లు చితక్కొట్టారు. బౌన్సర్ల దాడిలో తొమ్మిది మంది యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన యువకులు కార్తీక్ రెడ్డి, చంద్రకిరణ్ రెడ్డి, నవీన్ శరత్ చంద్ర జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు, పబ్‌కు వచ్చిన కస్టమర్లు భయబ్రాంతులకు గురయ్యారు.

 

Bouncers Attack on Young Mans in Amnesia Pub