Home వార్తలు బౌలర్ల జోరు.. వికెట్ల హోరు

బౌలర్ల జోరు.. వికెట్ల హోరు

పోటీల్లో తొలిరోజు బౌలర్లదే పైచేయి
ఉతప్ప హ్యాట్రిక్ శతకం

ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీట్రోఫీ ఎనిమిదో రౌండ్ తొలిరోజు పోటీల్లో బౌలర్లు వికెట్ల పండగ చేసుకున్నారు. ఎనిమిదోరౌండ్‌లో భాగంగా జరిగిన 12 మ్యాచ్‌ల్లో బౌలర్లు విజృంభించడంతో ఏకంగా ఆరు జట్లు తొలిరోజే తమ తొలిఇన్నింగ్స్‌ను ముగించాయి. బెంగాల్, ఒడిశా మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలిరోజే 20 వికెట్లు పడగా, కేరళ-సౌరాష్ట్ర, మధ్య ప్రదేశ్-ముంబయి మ్యాచ్‌ల్లో 16 వికెట్లు పడ్డాయి. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ కర్ణాటక, జార్ఖండ్, హైదరాబాద్, గోవా బ్యాట్స్‌మెన్‌లు తమతమ ప్రత్యర్థి బౌలర్లపై పైచేయి సాధించి జట్టుకు భారీస్కోర్లు అందించారు. 

test-matchకల్యాణి(పశ్చిమబెంగాల్) : బెంగాల్, ఒడి శా మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలి రోజే 20 వికెట్లు కూలాయి. తొలుత టాస్ నెగ్గి తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన బెంగాల్.. ధీరజ్‌సిం గ్(5/58), ప్రధాన్(3/15) దెబ్బకు 47.3 ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలింది. సహచరులందరూ సింగిల్ డిజిట్‌కే పరిమిత మైనా ఓపెనర్ ఈశ్వరన్(88) ఒంటరిపో రాటం చేశాడు. అనంతరం తొలిఇన్నింగ్స్‌కు దిగిన ఒడిశా.. ఆఫ్‌స్పిన్నర్ అమిర్ గని(6/34) మాయాజాలానికి 107 పరు గులకే కుప్పకూలింది. తొలిరోజుఆటముగిసే సమయానికి బెంగాల్ రెండోఇన్నింగ్స్‌లో 23/0తో నిలిచింది.
మాలాపూరం(కేరళ) : సౌరాష్ట్ర స్పిన్‌ద్వ యం ధర్మేన్ జడేజా(5/44), జీవ్జ్రని(4/61) విజృంభనకు కేరళ తొలిఇన్నింగ్స్‌లో 166 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ జగదీష్(59)టాప్‌స్కోరర్. అనంతరం తొలిఇన్నింగ్స్ ఆరంభించిన సౌరా ష్ట్ర 55 పరుగులకే ఆరువికెట్లు కోల్పోయింది. స్పిన్నర్ మోనీస్‌కు నాలుగు వికెట్లు దక్కాయి.
ఇండోర్ : ముంబయి, మధ్యప్రదేశ్ మ్యాచ్‌లోనూ వికెట్ల హోరు కొనసాగింది. తొలుత తొలిఇన్నిం గ్స్‌కు దిగిన మధ్య ప్రదేశ్ .. జైశ్వల్(4/63), శార్ధుల్(2/42) దెబ్బకు 240 పరుగులకు కుప్పకూల గా, అనంతరం జలజ్‌సక్సేనా(3/32), అంకిత్‌శర్మ(3/39) స్పిన్ మాయాజాలానికి ముంబయి తొలిరోజు ఆటముగిసే సమయానికి ఆరువికెట్లు కోల్పోయి 24 పరుగులతో నిలిచింది.
ఢిల్లీ : ఆంధ్ర బౌలర్లు స్నేహ్ కిశోర్(5/76), అయ్యప్ప(4/27) సత్తా చాటడంతో తొలిఇన్నింగ్స్‌లో రైల్వేస్‌ను 182 పరగులకే ఆలౌట్ చేసిన ఆంధ్ర ఆటముగిసే సమయానికి 62 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. రాజస్థాన్‌తో తలపడతున్న సెహ్వాగ్ నేతృత్వంలోని హర్యానా తొలి ఇన్నిం గ్స్‌లో 112 పరుగులకే కుప్పకూలింది. పేసర్ పంకజ్‌సింగ్‌కు నాలుగు, రజిత్‌భాటియాకు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం తొలిఇన్నింగ్స్‌లో రాజస్థాన్ వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది.
హుబ్లి : రాబిన్ ఉతప్ప(148) మెరుపు శతకానికి తోడు మయంక్ అగర్వాల్(118) రాణించడంతో ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక తొలిరోజు మూడు వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచేస్తున్న ఉతప్ప టోర్నీలో వరుసగా మూడోశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. పార్ట్‌టైమ్ బౌలర్ ద్రువ్‌శోరెయ్ బౌలింగ్‌లో రెండుసిక్సర్లు, రెండుఫోర్ల సహాయంతో ఏకంగా 22 పరుగులు పిండుకున్నాడు.
హైదరాబాద్ : కెప్టెన్ హనుమవిహారి(94బ్యాటింగ్), అనిరుద్(75బ్యాటింగ్) అజేయ అర్ధశతకాల కు తోడు ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్(45), అక్షిత్‌రెడ్డి(40) రాణించడంతో త్రిపురాతో జరుగుతు న్న మ్యాచ్‌లో హైదరాబాద్ తొలిఇన్నింగ్స్ మొదటిరోజు రెండు వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. ఇక జమ్మూతో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్ సునీల్‌దేశాయ్(106), అస్నోడకర్ (74బ్యాటింగ్), కామత్(57బ్యాటింగ్) సత్తాచాటడంతో గోవా తొలిఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 263 పరుగులు చేయగా, హిమాచల్‌ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో జార్ఖండ్ తమ తొలిఇ న్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 306 పరుగులతో నిలిచింది. ఓపెనర్ శివ్‌గౌతమ్(122) సౌరబ్‌తివారి(79) రాణించారు.