Home తాజా వార్తలు క్వార్టర్స్‌లో మంజురాణి

క్వార్టర్స్‌లో మంజురాణి

Boxer Manju Rani

 

ప్రపంచ బాక్సింగ్ టోర్నీ

ఉలన్ ఉడె : రష్యా వేదికగా జరుగుతున్న ప్రపంచ మహిళల బాక్సింగ్‌లో భారత బాక్సర్ మంజు రాణి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన మహిళల 48 కిలోల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో మంజు రాణి జయకేతనం ఎగుర వేసింది. వెనుజుల బాక్సర్ రోజాస్‌తో జరిగిన పోరులో మంజు రాణి ఘన విజయం సాధించింది. ఏక పక్షంగా సాగిన పోరులో మంజు రాణి 50 తేడాతో రోజాస్‌ను చిత్తు చేసింది. ఆరంభం నుంచే భారత బాక్సర్ జోరును కొనసాగించింది. ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తన మార్క్ పంచ్‌లతో రోజాస్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది.

ఇదే క్రమంలో అలవోకగా మ్యాచ్‌ను సొంతం చేసుకుని క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. కాగా, క్వార్టర్ ఫైనల్లో మంజు రాణి దక్షిణ కొరియా బాక్సర్ కిమ్ హ్యాంగ్‌తో తలపడుతుంది. ఈ పోరు వచ్చే సోమవారం జరుగుతుంది. మరో పోటీలో భారత బాక్సర్ మంజు బాంబోరియా ఓటమి పాలైంది. ఇక, దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ తన పోరాటాన్ని మంగళవారం ప్రారంభించనుంది. మేరీకోమ్ 51 కిలోల విభాగంలో బరిలోకి దిగుతోంది. ఇప్పటికే ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్‌షిగా నిలిచిన మేరీకోమ్ మరో స్వర్ణంపై కన్నేసింది.

Boxer Manju Rani reached Quarterfinals