Home జాతీయ వార్తలు లంచం కోసం….బాలుడి భిక్షాటన

లంచం కోసం….బాలుడి భిక్షాటన

begging-for-bribeచెన్నై: తమిళనాడులో లంచం కోసం ఓ బాలుడు బిక్షాటన చేశాడు. విల్లుపురం జిల్లా కున్నతూరు గ్రామానికి చెందిన కొలంజి అనే రైతు(50) గతేడాది మృతి చెందాడు. రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం కోసం మృతుడి భార్య (43) దరఖాస్తు చేసుకుంది. రైతు కుటుంబానికి సామాజిక భద్రత పథకం కింద రూ 12,500 మంజూరయ్యాయి. మృతుడి కుమారుడు ఆజిత్, భార్య రూ.12,500ల కోసం విఎఒ వద్దకు వెళ్లారు. ఈ రూపాయలకు సంబంధించిన చెక్ కావాలంటే మూడు వేల రూపాయల లంచం కావాలని విఎఒ డిమాండ్ చేశాడు. విఎఒకి లంచం ఇవ్వాలి భిక్షమేయండి అంటూ అజిత్ బ్యానర్ ఏర్పాటు చేసి బిక్షాటన చేయడం ప్రారంభించాడు. ఈ విషయం మీడియా ద్వారా జిల్లా ఉన్నతాధికారులకు తెలిసింది. దీంతో లంచం డిమాండ్ చేసిన విఎఒను సస్పెండ్ చేసి, రైతు సామాజిక భద్రత కింద మంజూరైన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వాధికారులు రైతు కుటుంబానికి అందజేశారు.