Home తాజా వార్తలు వేడి కూరలో పడి బాలుడు మృతి

వేడి కూరలో పడి బాలుడు మృతి

 

 

ముంబయి: మహారాష్ట్రలోని ఔరంగబాద్ ప్రాంతం చికల్ ఠాణాలో ఓ బాలుడు వేడి కూరలో పడి దుర్మరణం చెందాడు. పుష్పక్ గార్డెన్ ఏరియాలో సంతోష్ గాధు కుటుంబం నివసిస్తోంది. కుటుంబ సభ్యులందరూ భోజనం చేస్తుండగా సంతోష్ తనయుడు హర్షల్ ఆడుకుంటూ వచ్చి వేడి కూర పాత్రలో పడ్డాడు. కూర వేడిగా ఉండడంతో ముఖం మొత్తం కాలిపోయి చర్మం ఊడిపోయింది. తల్లిదండ్రులు హర్షల్ స్థానిక ఆస్పత్రికి తరలించారు. ముఖంతో సహా తల భాగం కాలిపోవడంతో ఇన్ ఫెక్షన్ ఎక్కువగా సోకడంతో సోమవారం ఉదయం మృతి చెందాడు.

 

Boy Dead after Fell into Hot Curry in Aurangabad
Boy Fell into Hot Curry in Aurangabad