మన తెలంగాణ/యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని నల్లవెల్లి గ్రామంలో సంక్రాంతి పండగ సందర్భంగా ఇంటి మేడపై బాలుడు గాలిటాన్ని ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లవెల్లి గ్రామానికి చెందిన బాయికాడి వెంకటయ్య కుమారుడు రాజేష్(13) సంవత్సరాల పిల్లోడు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇంటి మేడపై గాలిపటాన్ని ఎగురవేస్తుండగా అది విద్యుత్ తీగలకు చిక్కుకోవడంతో అక్కడే ఉన్న ఇనుప రాడ్డు సహాయంతో దానిని తీస్తేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు అది విద్యుత్ తీగలకు తగలడంతో విద్యుదాఘాతానికిగురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కాపాడ బోయిన అతని అక్క కూడా తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బాలుడి మృతితో పండగపూట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ప్రాణం తీసిన గాలిపటం
- Advertisement -
- Advertisement -
- Advertisement -