Home తాజా వార్తలు పురాతన భవనం కూలి బాలుడు మృతి

పురాతన భవనం కూలి బాలుడు మృతి

Old Buildingహైదరాబాద్‌:  సీతాఫల్‌మండిలో ఆదివారం ఉదయం ఓ పురాతన భవనం కూలింది. ఈ ఘటనలో 14 నెలల బాలుడు మృతి చెందాడు. ఆ పసికందు తల్లి తీవ్రంగా గాయపడింది. సదరు భవనంలో స్వాతి దంపతులు నివాసముంటున్నారు. ఆదివారం ఉదయం ఇంట్లో పడుకున్న సమయంలో ఇంటి పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో స్వాతి కొడుకు గీతామ్స్‌(14నెలలు)  అక్కడికక్కడే  మృతిచెందాడు. స్వాతి తీవ్రంగా గాయపడింది. స్వాతిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో స్వాతి భర్త ఇంట్లో లేరు. ప్రమాదంపై సమాచారం అందుకున్న  నగరపాలక డిప్యూటీ కమిషనర్‌ రవికుమార్‌ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. శవ పరీక్ష్ కోసం గీతామ్స్‌ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Boy Dead With Old Building Collapsed At Sitaphalmandi