Home secunderabad బాలుడి మృతికి వైద్యుల నిర్లక్షమే కారణమా…?

బాలుడి మృతికి వైద్యుల నిర్లక్షమే కారణమా…?

Boy died

 

డాక్టర్ల నిర్లక్షమే కారణం అంటున్న బంధువులు
మృతికి కారణమైన వైద్యులను శిక్షించాలని రోడ్డుపై బైఠాయింపు
వైద్యం వికటించి 9 నెలల బాలుడు మృతి

తార్నాక : తార్నాక ఇన్నోవా ఆసుపత్రిలో వైద్యం వికటించి 9 నెలల బాలుడు మృతి చెందడంతో బుధవారం బంధువులు ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌కు చెందిన నర్సింహ్మా,నాగలక్ష్మీలు దంపతులు. వీరి 9 నెలల బాబు అఖిల్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో తార్నాకలోని ఇన్నోవా ఆసుపత్రిలో శుక్రవారం వైద్యం కోసం చేర్పించారు.

బాలుడి వైద్యం కోసం దాదాపు 2.50 లక్షల రూపాలయలు ఫీజును సోమవారం చెల్లించారు. అయినప్పటికి డాక్టర్లు బాలుడికి సరిగ్గా వైద్యం అందించక పోవడంతోనే బాబు మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. రెండు రోజుల ముందే చనిపోయిన బాబుని బుధవారం చనిపోయాడని తెలిపిన డాక్టర్లపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు బాబు తల్లితండ్రులు.

తమకు న్యాయం జరగాలని,బాబు మృతికి కారకులైన డాక్టర్లను కఠినంగా శిక్షించాలని బాబు తల్లితండ్రులు,బంధువులు రోడ్డు పై బైఠాయించారు.ఈ మేరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న బంధువులను సద్దుమనిగించారు. బాబు మృతికి సంబంధించిన విషయమై దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

Boy died after failing Treatment