Home జోగులాంబ గద్వాల్ బైక్ ను ఢీకొట్టిన కారు… బాలుడు మృతి

బైక్ ను ఢీకొట్టిన కారు… బాలుడు మృతి

Boy Died In Road Accident At Jogulamba Gadwalజోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని గోన్పాడు వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు బైక్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్ పై వెళుతున్న తండ్రీకొడుకులను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదేళ్ల బాలుడు ఘటనాస్థలిలోనే చనిపోగా, తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన తండ్రిని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బాధితుల వివరాలు తెలియరాలేదని, పోస్టుమార్టం కోసం బాలుడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించామని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.