Saturday, April 20, 2024

బాలుడి ప్రాణం తీసిన బెలూన్

- Advertisement -
- Advertisement -

ముంబయి: బాలుడు బెలూన్ ఆడుకుంటూ మింగేయడంతో అతడు చనిపోయిన సంఘటన మహారాష్ట్రలోని అంధేరిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… దేవరాజు  నాగ్(4) అనే బాలుడు బెలూన్ ఊదుకుంటూ తన చెల్లితో ఆడుకుంటున్నాడు. దేవరాజు బెలూన్ నోట్లో పెట్టుకొని బయటకు లోపలికి ఊదుతుండగా గొంతులోకి వెళ్లిపోయింది. బాలుడి గొంతులో నుంచి బెలూన్ బయటకు తీసేందుకు కుటుంబ సభ్యుల ప్రయత్నించినప్పటికి విఫలం కావడంతో పటేల్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన నానావతి ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో మార్గమధ్యలో విగతజీవిగా మారాడు. వైద్యులు శవ పరీక్ష నిర్వహించి గొంతు నుంచి బెలూన్‌ను బయటకు తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News