Friday, December 2, 2022

చెరువులో పడి బాలుడు మృతి

- Advertisement -

Boy Fell In Pond And Died At Hydergudaరంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని  హైదర్‌గూడలో అదృశ్యమైన అనీష్ అనే ఆరేళ్ల బాలుడి ఉదంతం విషాదమైంది. హైదర్‌గూడలోని సిరిమల్లె కాలనీకి చెందిన అనీష్  గురువారం మధ్యాహ్నం అదృశ్యమయ్యాడు. అయితే అతని మృతదేహం ఇంటి సమీపంలోని చెరువులో శుక్రవారం లభ్యమైంది. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఆడుకుంటూ బిల్డింగ్‌పై నుంచి కిందికి వచ్చాడు. అయితే సాయంత్రం అయినప్పటికీ అనీష్ తిరిగి ఇంటికి పోలేదు. ఈ క్రమంలో అనీష్ కోసం తల్లిదండ్రులు పరిసరాల్లో గాలించినప్పటికీ, ఫలితం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మూడు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అనీష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే శుక్రవారం ఉదయం అనీష్ మృతదేహం అతడి ఇంటికి సమీపంలో ఉన్న చెరువులో లభ్యమైంది. ప్రమాదవశాత్తు అనీష్ చెరువులో పడి చనిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు. తనకు బ్యాటరీ బైక్‌ కొనివ్వాలని అనీస్  అడిగాడని,  దీంతో ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టానని, రెండు రోజుల్లో బైక్ వస్తుందని తమ కొడుకుకు చెప్పామని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని అనీష్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోస్టుమార్టం కోసం అనీష్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Latest Articles