నల్గొండ: పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిపై ఓ యువకుడు దాడిచేసి గాయపర్చిన సంఘటన నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలం కిష్టరాయునిపల్లిలో చోటుచేసుకుంది. విరాల్లోకి వెళితే… కిష్టరాయునిపల్లి చెందిన యువతి అదేగ్రామానికి చెందిన శివ అనే యువకుడు గత కొంత కాలం నుంచి ప్రేమలో ఉన్నారు. యవతి మరొకరితో పెళ్లి సిద్ధం కావడంతో ఆగ్రహించిన శివ సోమవారం ఆమెపై దాడి చేసి, తలపై బీరు సీసాలతో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన యువతి అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన స్థానికులు బాధితురాలిని చికిత్స నిమిత్తం మర్రిగూడ చికిత్స తరలించారు. యువతిపై దాడి అనంతరం యువకుడు మంచినీటి ట్యాంకుపై నుంచి దూకి ఆత్మహత్యయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని హైదరాబాద్ లోని ఓ ప్రవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరు చికిత్స పొందుతున్నారు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Boyfriend attack on girlfriend at nalgonda