Home తాజా వార్తలు సెల్ టవర్ ఎక్కి ప్రేమికుడి నిరసన..!

సెల్ టవర్ ఎక్కి ప్రేమికుడి నిరసన..!

Boyfriend Climbs Cell Tower for Love in Nalgonda District

నల్గొండ: తమ ప్రేమకు పెద్దలు అడ్డుపడుతున్నారని ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపిన ఘటన నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలో శనివారం చోటు చేసుకుంది. తమ ప్రేమకు యువతి తల్లిదండ్రులు అడ్డు చెబుతున్నారని కొండమల్లెపల్లిలో ఉన్న సెల్ టవర్ ఎక్కి యువకుడు నిరసన తెలిపాడు. కాగా, గతంలోనూ ఈ ప్రేమికుడు సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడని స్థానికులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.