Friday, March 29, 2024

ప్రియురాలితో గొడవ.. మనస్తాపంతో ప్రియుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

boyfriend commits suicide at girlfriend's house

రాజస్థాన్: ప్రియురాలి ఇంట్లో ప్రియుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాదఘటన రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని మహావీర్ నగర్ ప్రాంతానికి చెందిన కుల్దీప్ శర్మ (32) పెళ్లి చేసుకుని కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. అయితే ఉద్యోగ్‌ నగర్ పిఎస్ పరిధిలోని చంద్రశేఖర్ రెసిడెన్షియల్ స్కీమ్‌లో ఉండే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి ఆమె ఇంటికి వెళ్లి గడిపాడు. ఏదో విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగింది. దీంతో మనస్తాపం చెందిన అతను ప్రియురాలు నిద్రిస్తున్న పక్కగదిలో ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఆమె తెల్లవారుజామున గుర్తించి అతడిని ఆస్పత్రికి తరలించింది. అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

boyfriend commits suicide at girlfriend’s house

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News