Monday, June 23, 2025

తాను మరణిస్తూ మరో ఐదుగురికి ప్రాణం పోశాడు

- Advertisement -
- Advertisement -

బెంగళూరులో ఓ వ్యక్తి ‘బ్రెయిన్ డెడ్’ కావడంతో ఆయన ఐదు శరీర అవయవాలను దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎయిర్‌లిఫ్ట్ చేసి ఐదుగురికి కొత్త జీవితం ప్రసాదించారు. ఇది కర్ణాటక ‘జీవనసార్థకత’ కార్యక్రమం కింద చేపట్టారు. శుక్రవారం ఓ వ్యక్తి చనిపోవడంతో ఆయన ఐదు అవయవాలను భారత వాయు సేన బలగం దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎయిర్‌లిఫ్ట్ చేసి ఐదుగురికి నూతన జీవితం ప్రసాదించింది. దీనికి సంబంధించిన పోస్ట్‌ను భారత వాయుసేన ‘ఎక్స్’ పోస్ట్‌లో పెట్టింది. కిడ్నీ, కార్నియాను ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్(రిసెర్చ్ అండ్ రిఫరల్)కు తరలించారు. మిగతా అవయవాలను కూడా దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News