Home అంతర్జాతీయ వార్తలు గణతంత్ర వేడుకల అతిథిగా బ్రెజిల్ నేత

గణతంత్ర వేడుకల అతిథిగా బ్రెజిల్ నేత

PM Modi

 

బ్రిక్స్ నేపథ్యంలో బోల్సోనారో మోడీ భేటీ

బ్రెసిలియా : వచ్చే ఏడాది జరిగే భారత గణతంత్ర దినోత్సవాలకు బ్రెజిల్ అధ్యక్షులు జెయిర్ బోల్సోనారో ప్రధాన అతిధిగా హాజరవుతారు. ఇక్కడ జరుగుతున్న 11వ బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ బోల్సోనారేను ఆహ్వానించారు. దీనికి ఆయన సమ్మతి తెలిపారు. ప్రపంచ ఐదు ప్రధాన ఆర్థిక వ్యవస్థల దేశాలతో సంబంధాలను మెరుగు పర్చుకునేందుకు ప్రధాని మో డీ బ్రిక్స్ వేదికను అవకాశంగా మల్చుకున్నారు. ఉగ్రవాద నిరోధక యం త్రాంగం రూపకల్పన దిశలో చర్యల గురించి బ్రిక్స్ సదస్సు దృష్టి సారించింది. బుధవారం ఇక్కడికి చేరుకోగానే భారత ప్రధాని మోడీ ఆతిథ్య దేశ అధ్యక్షులతో భేటీ అయ్యారు. 2020 రిప్లబిక్ డే వేడుకలకు ప్రధాన అతిథిగా రావాలని కోరారు. దీనికి సమ్మతించిన బ్రెజిల్ నేత భారతదేశంతో సత్సంబంధాలను బలోపేతం చేయాలనే మోడీ అభ్యర్థనతో ఏకీభవించారు.

ఇరువురు నేతల మధ్య చర్చలు ఫలప్రదంగా సాగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బ్రెజిల్ నేత భారతదేశ సందర్శనకు వెళ్లుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాల పటిష్టత దిశలో విస్తృత చర్చలు జరుగుతాయి, కీలక ఒప్పందాలు కుదురుతాయని ఆశాభావంతో ఉన్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. పశు సంవర్థన, పంట అనంతర సంవిధానాలు, జీవ ఇంధనం, వ్యవసాయ పనిముట్లు వంటి పలు రంగాలు ప్రత్యేకించి వాణిజ్య సంబంధాల బలోపేతం దిశలో ఇరుదేశాలు కలిసికట్టుగా ముందుకు సాగాల్సి ఉందని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. దీనికి బ్రెజిల్ అధ్యక్షులు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే తమ దేశ వాణిజ్య ప్రతినిధి బృందాలు అనేకం భారత్ పర్యటనకు వెళ్లుతాయని తెలిపారు.

Brazil Jair Bolsonaro to chief guest at Republic Day