Home తాజా వార్తలు 2024 ఒలింపిక్ పోటీల్లో బ్రేక్ డ్యాన్సింగ్‌…

2024 ఒలింపిక్ పోటీల్లో బ్రేక్ డ్యాన్సింగ్‌…

 

ఇంటర్‌న్నెట్‌డెస్క్: పారిస్ వేదికగా 2024లో జరిగే ఒలింపిక్ పోటీల్లో బ్రేక్ డ్యాన్సింగ్‌ను కూడా భాగం చేస్తూ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ బోర్డు (IOC) నిర్ణయం తీసుకుంది. బ్రేక్ డ్యాన్సింగ్‌తో పాటు స్టేట్ బోర్డింగ్, స్పోర్ట్ క్లైబింగ్, సర్ఫింగ్ వంటి క్రీడలను కూడా పారిస్ ఒలింపిక్స్‌లో భాగం చేయాలని ఒలింపిక్ కమిటీ సభ్యులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, 2020 టోక్నో ఒలింపిక్స్‌లో బ్రేక్ డ్యాన్సింగ్ మినహా మిగిలిన మూడు క్రీడలను భాగం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  జూన్ 24 నుంచి 26 వరకూ స్విట్జర్లాండ్‌లోని లాసన్నేలో ఒలింపిక్ కమిటీ బోర్డు సర్వసభ్య సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా కొత్త క్రీడల గురించి చర్చించనున్నారు. డిసెంబర్ 2020 తర్వాత ఈ క్రీడలను ఒలింపిక్స్‌లో భాగం చేస్తే తీసుకోవాల్సిన చర్యలు, కసరత్తుల గురించి కమిటీ ఇచ్చే నివేదిక ద్వారా ఒలింపిక్ బోర్డు తుది నిర్ణయం తీసుకుంటుంది.

 

కాగా, కొరియా అథ్లెట్స్‌‌కు అవసరమైన ఆర్థిక సహకారం అందించేందుకు కూడా ఐఒసి ఆమోదించింది. అంతేకాకుండా ఒలింపిక్ క్రీడలను సామాన్య ప్రజలకు చేరువ చేసే దిశగా చర్యలు మొదలెట్టారు. ఇందులో భాగంగా ఐఒసి.. ‘లింగ సమానత్వం, యువతకు ప్రాధాన్యం, గ్రామీణులకు మరింత ప్రాధాన్యం’ సూత్రమే ప్రాతిపదికగా ప్రణాళికలు మొదలెట్టింది. కొత్తక్రీడాకారులను ప్రోత్సాహించే ఉద్దేశంతో కొత్తకొత్త క్రీడలను ఒలింపిక్స్‌లో చేర్చాలని కమిటీ భావిస్తోంది.

Breakdancing makes move to 2024 paris Olympic