Home జిల్లాలు జూరాల కాల్వకు గండ్లు

జూరాల కాల్వకు గండ్లు

Jurala-Canalరైతులకు కడగండ్లు, అధికారుల నిర్లక్షం… ఎండుతున్న పంటలు
ఆందోళనలో ఎగువ, చివరి ఆయకట్టు రైతులు
రైతులను ఆదుకోవాలంటున్న నేతలు , చర్యలకు ఉపక్రమించిన కలెక్టర్

మన తెలంగాణ/గద్వాల: చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. దీంతో వేలాది ఎకరాల్లో పంటలు ఎండి పోతున్నాయని చివరి ఆయకట్టు రైతులు, మోటార్లకు కనెక్షన్లు తొలగించడంతో చేతికొచ్చే పంటలు ఎండిపోతున్నాయని ఎగువ రైతులు గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. గతేడాది కం టే ఈ ఏడాది వర్షాలు బాగా కురవడంతో రైతులు పంటలు భారీ ఎత్తున పంటలు వేసుకున్నారు. పంటలు చేతికొచ్చ సమయంలో సాగు నీటి కోసం రైతులు ఆందోళనకు దిగుతున్నారు. కానీ అధికారుల నిర్లక్షం కారణంగా గత కొన్నేళ్లుగా చివరి ఆయకట్టు రైతులకు నీరందకపోవడం ప్రధాన కారణం. జూరాల ప్రాజెక్టు పరిధిలోని కుడి కాల్వ ధరూర్, గద్వాల, ఇటిక్యాల, మానవపాడు మండలాల మీదుగా వెళ్తుంది. కాల్వ పరిధిలో సుమారు 28డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి. ప్రాజెక్టు నుండి 46.27కిలో మీటర్లు  పొడవునా ఉన్న కుడికాల్వ ద్వారా 35వేల  ఎకరాల పంటలకు సాగు అందాల్సి ఉంది. గత కొంత కాలంగా చివరి ఆ యకట్టుకు నీరు అందకపోవడంతో ప్రతియేటా పంటలు ఎండుతున్నాయి.  సంబంధిత నీటి పారుదల శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో నూతన జిల్లా ఏర్పడటంతో కలెక్టరేట్ అందుబాటులోకి రావడంతో  ఇటిక్యాల, మానవ పాడు మండలాల రైతులు కలెక్టర్ రజత్ కుమార్ షైనీని కలిసి నిరసన వ్యక్తం చేశారు.