Wednesday, April 24, 2024

కరెన్సీ లెక్కపెట్టరాని వాడితో పెళ్లేమిటన్న వధువు!

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఫరూఖాబాద్ జిల్లాలో వరుడికి లెక్కలు కూడా రాకపోయేసరికి 21 ఏళ్ల వధువు పెళ్లినే తిరస్కరించింది. పెళ్లిలో వరుడు కరెన్సీ నోట్లను కూడా లెక్కించలేకపోయాడు. పంతులుకి అనుమానం వచ్చింది. పైగా వరుడి ప్రవర్తనపై కూడా అతడికి అనుమానం కలిగింది. దాంతో అతడు అమ్మాయి తరఫు వారికి తెలిపాడు. వధువు రీటా సింగ్ వెంటనే వేదిక మీద నుంచి దిగిపోయింది. దాంతో ఇరువైపుల కుటుంబాలు వాదోపవాదనకు దిగాయి. తర్వాత పోలీసులను పిలిపించారు. వధువు తరఫు వారు పెళ్లి రోజు వరకు 23 ఏళ్ల వరుడు ‘మానసికంగా వికలాంగుడు’ అని తెలియదని తెలిపారు.

వధువు సోదరుడు మోహిత్ మాట్లాడుతూ ‘మధ్యవర్తుల మీద నమ్మకంతో పెళ్లిళ్లు జరుగుతుంటాయి. పైగా మధ్యవర్తి మా కుటుంబానికి దగ్గరివాడు. దాంతో మేము అతడిని నమ్మాము. కానీ వరుడి ప్రవర్తన గురించి పంతులు మాకు చెప్పాకే మాకు అతడి విషయం తెలిసింది. దాంతో మేము వరుడికి రూ. 10నోట్లు ముప్పై ఇచ్చి లెక్కపెట్టమన్నాము. కానీ అతడు లెక్కపెట్టలేకపోయాడు. అతడి మానసిక స్థితి చూసి వధువు రీటా పెళ్లి వద్దంది’ అని తెలిపాడు.

ఎప్పుడైతే వధువు పెళ్లి వద్దందో అప్పుడు ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం చివరికి పోలీసుల వరకు వెళ్లింది. పోలీసులు సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. కానీ వధువు ససేమీరా అంది. దాంతో బరాత్ వెనక్కి వెళ్లిపోయింది. కాగా పోలీస్ స్టేషన్ హెడ్ ఆఫీసర్ అనీల్ కుమార్ ‘ ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి పోలీసు ఫిర్యాదు అందలేదు’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News