Wednesday, April 24, 2024

సంతే పరిణయ వేదిక

- Advertisement -
- Advertisement -

కొన్ని పనులు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి చైనాలో పెళ్లిళ్ల సంతలా… ఆ సంతలో నిత్యావసర వస్తువులు కొనుక్కునే బదులు జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు. షాంఘై మ్యారేజ్ మార్కెట్ చైనాలో 2005 నుంచి కొనసాగుతుంది. పీపుల్స్ పార్క్‌లో ఈ పెళ్లిళ్ల సంత ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం సంపాదించింది. ఈ ప్రాంతం చూసేందుకు గొడుగుల అంగడిలాగా ఉంటుంది.  పెళ్లికి సిద్ధంగా ఉన్నవాళ్లు తమ అందచందాలు, ఒడ్డూ పొడుగు, ఆస్తి, అంతస్తు, ఉద్యోగం వంటి వివరాలు బయోడేటాలాగా రాసి దాన్ని గొడుగుపైన అతికించి దాన్ని ముందు పెట్టుక్కూర్చుంటారు. సంబంధాలు కోసం వచ్చిన వధూవరులు, వాళ్ల తల్లిదండ్రులు ఈ గొడుగులపైన బయోడేటాలను చదువుకుంటూ తమకు సరిపోయే సంబంధం అనుకుంటే మంచి చెడు మాట్లాడుకుని ఆ తర్వాత ఘనంగా పెళ్లిళ్లు చేస్తారు. ఇక్కడ ఇంకో బంపర్ ఆఫర్ మేరేజ్ బ్యూరోలు కూడా ఉంటాయి. చైనా సంప్రదాయంలో పెళ్లి తరువాత భార్యాభర్తలు నివసించే ఇంటిని అబ్బాయే ఏర్పాటు చేయాలి. ఇంటికి కావలసినవి అమ్మాయి కొనాలి. చైనాలో కూడా భారత్‌లోలాగే ఒక్క సంతానం మాత్రమే కనేందుకు ఇష్టపడతారు కాబట్టి పెళ్లిళ్లు చాలా కష్టం అవుతున్నాయి.

 

Bride groom Purchased in China Market
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News