Home జాతీయ వార్తలు కోల్‌కతాలో కూలిన వంతెన

కోల్‌కతాలో కూలిన వంతెన

Bridge Collapsed in Kolkata

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో మంగళవారం సాయంత్రం ఆలీపోర్ ప్రాంతంలో మజర్‌హట్ వంతెన కుప్పకూలింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. కార్లు, బస్సులు కూడా వంతెన కింద చిక్కుకున్నట్టు అనమానిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులు పలువురిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. చాలా మంది వంతెన శిథిలాల కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.

Bridge Collapsed in Kolkata